నవతెలంగాణ – రాయపోల్ : మొంథా తుఫాన్ ప్రభావం గత రెండు రోజుల క్రితం భారీ వర్షాలు కురుస్తారని వర్షాలకు వరి మొక్కజొన్న ధాన్యం తడవడం జరిగిందని ఆ తడిసిన ధాన్యమును పరిశీలించడం జరిగిందని గజ్వేల్ ఏడిఏ బాబు నాయక్ అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల పరిధిలోని మంతర్ గ్రామ పరిధిలోని ఆర బెట్టిన వరి, మొక్కజొన్న ధాన్యంను వ్యవసాయ అధికారులు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అధికారుల ఇచ్చే వాతావరణ సలహాలు సూచనలు పాటిస్తూ వరి మరియు మొక్క జొన్న పంటలను ఆరబెట్టు కోవాలన్నారు. అలాగే కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం వచ్చిన వరి ధాన్యాన్ని పరిశీలించి తేమ శాతం వచ్చిన వాటిని వెంటనే కాంట వేయించాలని కేంద్రం నిర్వాహకులకు సూచించడం జరిగిందన్నారు.అదే విధంగా వరి కోతకోసే రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ పంటను కోతలు చేసుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితిలో దృష్ట రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఆర్. నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రవీణ్,ఆశ్లేష, రైతులు పాల్గొన్నారు.
తడిసిన ధాన్యమును పరిశీలించిన వ్యవసాయ అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    