Friday, October 31, 2025
E-PAPER
Homeఖమ్మంమోడీ విధానాలతో తిరోగమనంలో వ్యవసాయం రంగం

మోడీ విధానాలతో తిరోగమనంలో వ్యవసాయం రంగం

- Advertisement -

– తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచిలి వంశీ
– టన్ను పామాయిల్ గెలలు ధర కనీసం రూ.25 వేలు ఉండాలి 
– తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనా విధానాలతో  వ్యవసాయ రంగం తిరోగమనంలో పడిందని,దీంతో రోజుకు సుమారుగా 2 వేల మంది వ్యవసాయ వదిలి పట్టణాలకు వెళ్ళిపోతున్నారు అని ఏఐకేఎస్ – ఆల్ ఇండియా కిసాన్ సభ అనుబంధ తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచిలి వంశీ క్రిష్ణ అన్నారు. ఈ విధానాలు ఇలానే అమలైతే మరింతగా వ్యవసాయ రంగానికి ప్రజలు దూరమయ్యే అవకాశం ఉందని వాపోయారు.

ఈ సంఘం అశ్వారావుపేట మండల రెండోవ మహా సభను శుక్రవారం మండలంలోని వినాయక పురం చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం ప్రాంగణంలో దుర్గారావు,శాంతి ల అద్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వంశీ కృష్ణ మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ ప్రకారం టన్ను పత్తి కి రూ.10 వేలు 75 లు చెల్లించాలని డిమాండ్ చేసారు.కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకునే విధానాన్ని రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకోవాలని,పత్తి మీద 11% దిగుమతి సుంకాన్ని తిరిగి మళ్లీ అమలు చేయాల‌ని, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల్లో వ్యవసాయ రంగాన్ని మినహాయించాలి అని,ఆహార ఉత్పత్తులను విదేశాల నుంచి దిగువ చేసుకోవడం అంటే దేశీయ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయడమే నని ఆయన అన్నారు.దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర ఆహార సంక్షేమ ఏర్పడే పరిస్థితి వస్తుందని అన్నారు. 

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న సంఘం ఉపాధ్యక్షులు కొక్కెరపాటి పుల్లయ్య మాట్లాడుతూ పామాయిల్ టన్ను గెలలు ధర కనీసం రూ. 25 వేలు ఉండేలా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు. వంధ్యత్వ మొక్కలకు నష్టపరిహారం ఇవ్వాలని, నాణ్యమైన మొక్కలు సరఫరా చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దొడ్డ లక్ష్మినారాయణ,గడ్డం సత్యనారాయణ,కలపాల భద్రం, మోరంపుడి శ్రీనివాస్ రావు,చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -