Monday, March 9, 2026
E-PAPER
Homeఆటలునిండు కుండ‌లా అహ్మ‌దాబాద్ స్టేడియం..టాస్ గెలిచిన కివీస్

నిండు కుండ‌లా అహ్మ‌దాబాద్ స్టేడియం..టాస్ గెలిచిన కివీస్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అహ్మ‌దాబాద్ వేదిక‌గా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ తుది పోరు ప్రారంభంకానుంది. ఇండియా-న్యూజిలాండ్ జ‌ట్లు టైటిల్ కోసం అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈక్ర‌మంలో కివీస్ టాస్ గెలిచి..భార‌త్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అదే విధంగా తుదిపోరును చూడ‌డానికి గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ స్టేడియానికి క్రికెట్ అభిమానులు భారీగా పోటెత్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి క్రికెట్ అభిమానులు తండోప‌తండాలుగా త‌ర‌లివ‌చ్చారు. దీంతో స్టేడియం నిండు కుండ‌లా త‌లపిస్తోంది. టీమిండియా..టీమిండియా అంటూ అభిమానులు కేరింత‌లు కొడుతున్నారు. అదే విధంగా ఫైన‌ల్ పోరు చూడ‌డానికి ప్ర‌ముఖులు స్టేడియానికి క్యూక‌ట్టారు. వీఐపీ రాక నేప‌థ్యంలో పోలీసులు భారీ భ‌ద్ర‌తా క‌ల్పించారు. నిఘా నేత్రాల‌తో బందోబ‌స్తును ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

నెల‌రోజుల సాగిన ఈ మెగా టోర్నీ నేటి ఫైన‌ల్ పోరుతో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్న‌మెంట్ ముగియ‌నుంది. స్టేడియంలో ముగింపు వేడుక‌లు గ్రాండ్ ఏర్పాట్లు చేశారు. లేజ‌ర్ లైట్ల షో చూప‌రుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ప్రేక్ష‌కుల‌ను ఆల‌రించ‌డానికి నృత్య‌ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేశారు.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టిమ్ సీఫెర్ట్(w), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(c), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -