No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంప్రోగ్రామర్లను ఏఐ భర్తీ చేయలేదు

ప్రోగ్రామర్లను ఏఐ భర్తీ చేయలేదు

- Advertisement -

– కోడింగ్‌పై దాని ప్రభావం ఉండదు
– మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ :
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. పలు ఐటీ కంపెనీలు కూడా ఏఐను వినియోగిస్తున్నాయి. ఫలితంగా తమ ఉద్యోగాలు కోల్పోతామేమోనన్న ఆందోళన, అభద్రత ఉద్యోగుల్లో తీవ్రంగా పెరిగిపోయింది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించి.. వారి స్థానాల్లో ఏఐతో భర్తీ చేస్తున్నాయి. ఉద్యోగుల్లో ఈ ఆందోళనల వేళ మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌ ఐటీ ఉద్యోగులకు ఊరట కలిగించేలా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే వందేండ్లైనా ప్రోగ్రామర్లను ఏఐ భర్తీ చేయలేదన్నారు. కోడింగ్‌ పైనా ఏఐ ప్రభావం ఉండదని ఆయన చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కత్రిమ మేధ(ఏఐ) అనేది ప్రోగ్రామింగ్‌ రంగంలో మనిషికి ప్రత్యామ్నాయం కాలేదని ఆయన చెప్పారు. కేవలం ఒక సహాయకారిగా మాత్రమే పనిచేస్తుందని అన్నారు. ”ప్రోగ్రామింగ్‌లో క్లిష్టమైన సమస్యగా భావించేదాన్ని క్రియేటీవ్‌గా పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రోగ్రామింగ్‌లో అది సవాలుతో కూడుకున్న విషయం. మానవ మేధస్సు లేని యంత్రాలు అలా చేయలేవు” అని బిల్‌గేట్స్‌ వ్యాఖ్యానించారు. కోడింగ్‌ అంటే కేవలం టైపింగ్‌ చేయడం కాదనీ, చాలా లోతుగా ఆలోచించాల్సి ఉంటుందని బిల్‌గేట్స్‌ తెలిపారు. ఈ మేరకు భవిష్యత్తులో కోడింగ్‌, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌, బయాలజీ రంగాలకు ఆటోమేషన్‌ ముప్పు తక్కువేనని ఆయన అంచనా వేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad