Monday, February 16, 2026
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌

ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: దేశ రాజధాని ఢిల్లీలోని భారత్‌ మండపంలో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌ (AI Impact Summit- 2026)’ ను నిర్వహిస్తుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాలకు భారత యువత ప్రతిభ, సామర్థ్యం తెలుస్తాయని అన్నారు. మన ప్రతిభను ప్రదర్శించడం, డిజిటల్‌ పబ్లిక్‌ మౌలిక సదుపాయాలను విస్తరించడం, విస్తృతమవుతున్న అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేయడం ఈ సదస్సు ఉద్దేశమని ప్రధాని మోదీ వెల్లడించారు.

ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకు ఢిల్లీలో జరగనున్న ఈ సదస్సుకు 45కు పైగా దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. ఆయా దేశాలు తమ ఏఐ అజెండాలను నిర్వచించుకోనున్నాయని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -