Wednesday, March 25, 2026
E-PAPER
Homeజాతీయంఎఐఎడిఎంకె తొలి జాబితా విడుద‌ల‌

ఎఐఎడిఎంకె తొలి జాబితా విడుద‌ల‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్‌ 23వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె) 23 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పడి కె. పళనిస్వామి పేరు కూడా ఉంది. ఈ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు కె.పి మునుస్వామి (వెప్పనహళ్లి), సి శ్రీనివాసన్‌ (దిండిగుల్‌, ఆర్‌ విశ్వనాథన్‌ (నాథమ్‌), ఎస్‌ పి వేలుమణి (తొండముత్తూరు), డి జయకుమార్‌ (రాయపురం) నుంచి పోటీ చేస్త్నున్నట్లు జాబితా వెల్లడించింది. వీరితోపాటు పి. బాలకృష్ణ (కృష్ణగిరి) వంటి సీనియర్‌ నేతలు కూడా ఉన్నారు. ఆల్‌ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పాలక మండలి పరిశీలన తర్వాతే ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగిందని పళనిస్వామి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -