– నవతెలంగాణ సీనియర్ సబ్‌ఎడిటర్ లలితకు మాతృవియోగం
– నివాళి అర్పించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, నవతెలంగాణ సీజీఎం పి.ప్రభాకర్
– గాంధీ మెడికల్ కాలేజీకి నేడు భౌతికకాయం అప్పగింత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నవతెలంగాణ సీనియర్ సబ్ ఎడిటర్ లలితకు మాతృవియోగం కలిగింది. ఏడాదిన్నరగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఐద్వా నేత కంచి తాయారమ్మ(78) మంగళవారం హైదరాబాద్‌లోని సిటిజన్ ఆస్పత్రిలో పరిస్థితి విషమించి కన్ను మూశారు. వైద్యపరిశోధనల నిమిత్తం ఆమె భౌతిక కాయాన్ని బుధవారం ఉదయం 10:30 గంటలకు గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించనున్నట్టు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆమె ఐద్వా సంఘంలో సుధీర్ఘ కాలం పాటు పనిచేశారు. ఆమె భర్త కె.ముత్యాలు పోస్టల్ యూనియన్‌లో చురుగ్గా పనిచేశారు. తాయారమ్మకు ముగ్గురు కూతుర్లు నాగలక్ష్మి, అరుణ, లలిత ఉన్నారు. నాగలక్ష్మి ఐద్వా రాష్ట్ర సీనియర్ నాయకులుగా, లలిత నవతెలంగాణ దినపత్రికలో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆమె అల్లుడు ఎం.శ్రీనివాసరావు సీపీఐ(ఎం) హైదరాబాద్ సిటీ సెంట్రల్ జిల్లా కమిటీ కార్యదర్శివర్గ సభ్యులుగా ఉన్నారు. గాంధీనగర్‌లో హకీమ్ అపార్ట్‌మెంట్స్‌లో ఆమె భౌతికకాయానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి. జ్యోతి, సీఐటీయూ అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత, సీపీఐ(ఎం) రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మెన్ డీజీ.నర్సింహారావు, నవతెలంగాణ దినపత్రిక సీజీఎం పి.ప్రభాకర్, ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్, బుక్ హౌజ్ ఎడిటర్ కె.ఆనందా చారి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, అధ్యక్షులు అరుణజ్యోతి పూలమాలలు వేసి నివాళి అర్పిం చారు. ఆమె మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదా ర్చారు. మహిళా సంఘానికి ఆమె చేసిన సేవలను మననం చేసు కున్నారు. నివాళి అర్పించిన వారిలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్, పద్మశ్రీ, ఐలూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారధి, సీపీఐ(ఎం) నగర కార్యదర్శి ఎం.వెంకటేశ్, మాజీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్, ఎస్‌వీకే మేనేజింగ్ కమిటీ సభ్యులు బుచ్చిరెడ్డి, బాలోత్సవం ప్రధాన కార్యదర్శి సోమయ్య, నవతెలంగాణ జనరల్ మేనేజర్ వెంకటేశ్, హెచ్‌ఆర్ మేనేజర్ నరేందర్‌రెడ్డి, బ్యూరోచీఫ్ బీవీఎన్. పద్మరాజు, బోర్డు సభ్యులు కె.ఎన్.హరి, మోహన్‌కృష్ణ, సలీమ, తదితరులు ఉన్నారు. తాయారమ్మ మృతికి నవతెలంగాణ ఇన్‌చార్జి ఎడిటర్ ఆర్.రమేశ్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాయారమ్మ మృతి తీరని లోటు : సీఐటీయూ
సీనియర్ నాయకులు తాయారమ్మ మృతి తీరని లోటు అని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమె మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ యువనాయ కులను ఆమె తయారు చేశారనీ, ఐద్వాలో కీలక బాధ్యతలు చేపట్టారని గుర్తుచేశారు. ఆమె కూతుర్లు, అల్లుళ్లు కూడా సీపీఐ(ఎం)లో చురుగ్గా పనిచేస్తున్నారని తెలిపారు.
అనారోగ్యంతో ఐద్వా నేత తాయారమ్మ కన్నుమూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES