Saturday, January 24, 2026
E-PAPER
Homeమానవిఐద్వా ప్రస్థానం

ఐద్వా ప్రస్థానం

- Advertisement -

భారత దేశ చరిత్రలో మహిళా ఉద్యమాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. స్వాతంత్రోద్యమం నుండి సమాజ మార్పులో వారి పాత్ర అమూల్యమైనది. ఆనాటి నుండే స్త్రీ విముక్తి కోసం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీ సమానత్వం కోసం మహిళలందరినీ ఏకం చేసేందుకు 1981లో ఏర్పడిన అఖిల భారత మహిళా సంఘం(ఐద్వా) నాటి నుండి ఎన్నో పోరాటాలు చేస్తోంది. కష్టంలో ఉన్న మహిళలను అమ్మలా అక్కున చేర్చుకుంటుంది. ఆపదలో ఉన్న అమ్మాయిని అక్కలా ఆదరిస్తుంది. సాంఘిక దురాచారాలపై పోరాడుతుంది. పురుషాధిక్య భావజాలంపై ఉద్యమి స్తోంది. మహిళా సమానత్వం కోసం అహర్నిశలూ శ్రమిస్తోంది. మహిళల హక్కులే మానవ హక్కులు అని గొంతెత్తి చాటుతోంది. ప్రజాస్వామ్యం, సమానత్వం, మహిళా విముక్తే లక్ష్యంగా ముందుకు నడుస్తున్న ఐద్వా అఖిల భారత మహాసభలు జనవరి 25 నుండి 28 వరకు హైదరాబాద్‌ మహానగరంలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన అఖిల భారత మహాసభల సంక్షిప్త సమాహారం…

మొదటి మహాసభ
తేదీ : 1981, మార్చి 10-12
స్థలం : చెన్నై
మొదటి అధ్యక్షులు – మంజరి గుప్తా
కార్యదర్శి – సుశీల గోపాలన్‌

రెండవ మహాసభ
తేదీ : 1986, అక్టోబర్‌ 17-20
స్థలం : తిరువనంతపురం (కేరళ)
అధ్యక్షులు – మంజరి గుప్తా
కార్యదర్శి – సుశీల గోపాలన్‌

మూడవ మహాసభలు
తేదీ : 1990, నవంబర్‌ 9-12
స్థలం : కొల్‌కతా (వెస్ట్‌ బెంగాల్‌)
అధ్యక్షులు – సుశీల గోపాలన్‌
కార్యదర్శి – శ్యామిలి గుప్తా, బృందా కరత్‌

నాలుగవ మహాసభలు
తేదీ : 1994, ఆగస్ట్‌ 11-14
స్థలం : కోయంబత్తూర్‌ (తమిళనాడు)
అధ్యక్షులు – సుశీల గోపాలన్‌
కార్యదర్శి – బృందా కరత్‌

ఐదవ మహాసభలు
తేదీ : 1998, జూన్‌ 11-14
స్థలం : బెంగుళూర్‌ (కర్నాటక)
అధ్యక్షులు – సుశీల గోపాలన్‌
కార్యదర్శి – బృందా కరత్‌

ఆరవ మహాసభలు
తేదీ : 2001, నవంబర్‌ 24-27
స్థలం : విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్‌)
అధ్యక్షులు – సుభాషిణీ ఆలి
కార్యదర్శి – బృందా కరత్‌

ఏడవ మహాసభలు
తేదీ : 2004, నవంబర్‌ 18-21
స్థలం : భువనేశ్వర్‌ (ఒడిషా)
అధ్యక్షులు – సుభాషిణీ ఆలి
కార్యదర్శి – సుధా సుందరరామన్‌

ఎనిమిదవ మహాసభలు
తేదీ : 2007, నవంబర్‌ 4-9
స్థలం : భువనేశ్వర్‌ (ఒడిషా)
అధ్యక్షులు – సుభాషిణీ ఆలి
కార్యదర్శి – సుధా సుందరరామన్‌

తొమ్మిదవ మహాసభలు
తేదీ : 2010, నవంబర్‌ 8-12
స్థలం : కాన్పూర్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)
అధ్యక్షులు – శ్యామిలీ గుప్తా
కార్యదర్శి – సుధా సుందరరామన్‌

పదవ మహాసభలు
తేదీ : 2013, నవంబర్‌ 22-25
స్థలం : బుద్దగయ (బీహార్‌)
అధ్యక్షులు – మాలినీ భట్టాచార్య
కార్యదర్శి – జగ్మతి

పదకొండవ మహాసభలు
తేదీ : 2016, డిసెంబర్‌ 10-14
స్థలం : భోపాల్‌ (మధ్యప్రదేశ్‌)
అధ్యక్షులు – మాలినీ భట్టాచార్య
కార్యదర్శి – జగ్మతి

పన్నెండవ మహాసభలు
తేదీ : 2019, డిసెంబర్‌ 27-30
స్థలం : ముంబై (మహారాష్ట్ర)
అధ్యక్షులు – మాలినీ భట్టాచార్య
కార్యదర్శి – మరియం ధావలే

పదమూడవ మహాసభలు
తేదీ : 2023, జనవరి 6-9
స్థలం : తిరువనంతపురం (కేరళ)
అధ్యక్షులు – పి.కె.శ్రీమతి
కార్యదర్శి – మరియం ధావలే

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -