నవతెలంగాణ-హైదరాబాద్: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి AIMIM మద్దతు ఇస్తుందని ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు జస్టిస్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.ఈ మేరకు తమ పార్టీ హైదరాబాదీ, గౌరవనీయ న్యాయనిపుణులు అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తుందని ఆయన తన ఎక్స్ సందేశంలో వెల్లడించారు. అంతేకాదు, తాను జస్టిస్ సుదర్శన్ రెడ్డితో కూడా మాట్లాడి ఆయనకు మా శుభాకాంక్షలు తెలియజేశానని అసద్ తెలిపారు. ఇండియా కూటమి పక్షాలన్నీ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించాయి.ఇలా ఉండగా, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు NDA తన అభ్యర్థిగా CP రాధాకృష్ణన్ ను నిలిపిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9న ఈ ఎన్నిక జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
బి.సుదర్శన్ రెడ్డికి AIMIM మద్దతు
- Advertisement -
- Advertisement -