- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గువాహటి – హైదరాబాద్ విమానం IX 2884ను బుధవారం అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. అయితే క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ‘ఎక్స్’ లో అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా గురువారం వివరణ ఇచ్చింది. ‘అనివార్య కారణాల వల్ల విమానాన్ని రద్దు చేసినందుకు చింతిస్తున్నామని మా బృందం ప్రయాణికులకు కావాల్సిన ఏర్పాట్లు చేసిందని సమాధానం ఇచ్చింది.
- Advertisement -



