– అబుదాబీకి దారిమళ్లిన ఎయిర్ ఇండియా విమానం
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్ నగరంలోని బెన్ గురియన్ విమానాశ్రయం సమీపంలో క్షిపణి దాడి జరిగిన నేపథ్యంలో టెల్ అవీవ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని ఆదివారం అబూధాబీకి మళ్లించారు. టెల్ అవీర్‌లో ఎయిర్ ఇండియా విమానం ఏఐ139 దిగడానికి గంట ముందు క్షిపణి దాడి జరిగింది. జోర్డాన్ గగనతలంలో ఉన్న సమయంలో విమానాన్ని దారి మళ్లించారు. విమానం అబూధాబీలో దిగిందని, తిరిగి ఢిల్లీకి వస్తుందని ఎయిర్ ఇండియా తెలిపింది. క్షిపణి దాడి నేపథ్యంలో ఈ నెల 6వ తేదీ వరకూ న్యూఢిల్లీ-టెల్ అవీవ్ మధ్య నడవాల్సిన విమానాలను రద్దు చేసినట్టు చెప్పింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ఎమన్ నుండి క్షిపణి దాడి జరగడంతో టెల్ అవీవ్ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేసినట్టు ఇజ్రాయిల్ పోలీసులు తెలిపారు. క్షిపణి దాడి జరిగిన తర్వాత విమానాశ్రయం సమీపం నుండి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.
క్షిపణి దాడి నేపథ్యంలో…
- Advertisement -
- Advertisement -