Friday, January 9, 2026
E-PAPER
Homeజాతీయంకొచ్చిన్‌లో అత్య‌వ‌స‌రంగా ఎయిరిండియా ల్యాండ్

కొచ్చిన్‌లో అత్య‌వ‌స‌రంగా ఎయిరిండియా ల్యాండ్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయినట్లు ఒక అధికారి గురువారం తెలిపారు. 160మంది ప్రయాణికులతో జెడ్డా నుండి కోజికోడ్‌ బయలుదేరిన విమానంలో ల్యాండింగ్‌ గేర్‌, టైర్‌ వైఫల్యమైనట్లు వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో గురువారం ఉదయం 9.07గంటలకు విమానాన్ని కొచ్చిలో సురక్షితంగా ల్యాండ్‌ చేసినట్లు ఆ అధికారి ప్రకటించారు.

జెడ్డా నుండి కోజికోడ్‌కు బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ఐఎక్స్‌ 398ను అత్యవసరంగా సురక్షితంగా ల్యాండింగ్‌ చేయడంలో తాము విజయం సాధించినట్లు కొచ్చిన్ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (సిఐఎఎల్‌) కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. కుడివైపు ప్రధాన ల్యాండింగ్‌ గేర్‌, టైర్‌ వైఫల్యం చెందడంతో విమానంలో సాంకేతిక సమస్య ఎదురైందని, దీంతో అత్యవసరంగా ఈ విమానాన్ని కొచ్చికి మళ్లించినట్లు ఆ ప్రకటన తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -