- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నాగ్‌పూర్ నుండి ఢిల్లీ వెళ్తున్న ఏఐ466 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షిని ఢీకొట్టింది. దీంతో పైలట్లు అప్రమత్తమై విమానాన్ని తిరిగి నాగ్‌పూర్‌కు మళ్లించారు. నాగ్‌పూర్‌లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, అధికారులు ప్రయాణాన్ని రద్దు చేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.
- Advertisement -



