Saturday, December 13, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో గాలి నాణ్యత ప్ర‌మాద‌క‌రం

ఢిల్లీలో గాలి నాణ్యత ప్ర‌మాద‌క‌రం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఢిల్లీలో గాలి నాణ్యతలు ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. శనివారం దేశ రాజధానిలో ఎక్యూఐ 397 స్థాయిలు నమోదయ్యాయి. వీటిని ప్రమాదకరస్థాయిలుగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వర్గీకరించింది. ఢిల్లీలోని 21 పర్యవేక్షణ కేంద్రాల్లో ఎక్యూఐ 400 మార్క్‌ను దాటిందని సిపిసిబి వెల్లడించింది. సిపిసిబి సమాచారం ప్రకారం వాజీర్పూర్‌లో ఎక్యూఐ 445, వివేక్‌ విహార్‌లో 444, జహంగిరిపురి 442, ఆనంద్‌ విహార్‌ వద్ద 439, అశోక్‌ విహార్‌ 437, అలాగే రోహిణి ప్రాంతంలో 437 వద్ద ఎక్యూఐ స్థాయిలు నమోదయ్యాయి. నరేలా వద్ద 432, ప్రతాపగంజ్‌ : 431, ముండ్కా 430, బవానా, నెహ్రూ నగర్‌లో 429 వద్ద ఎక్యూఐ స్థాయిలు నమోదయ్యాయి. ఇక చాందినీ చౌక్‌ 423, పంజాబ్‌ బాగ్‌, సోనియా విహార్‌ వద్ద 424గా ఎక్యూఐ నమోదైంది. ఆర్‌ కె పురం : 408, ఓక్లా ఫేస్‌ వద్ద 404గా నమోదైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -