Saturday, November 22, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో గాలి నాణ్య‌త వెరీ పూర్

ఢిల్లీలో గాలి నాణ్య‌త వెరీ పూర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఢిల్లీలో గాలి నాణ్యతలు క్షీణించాయి. వెరీ పూర్‌ కేటగిరీలోనే గాలి నాణ్యతలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో 359 స్థాయి వద్ద గాలి నాణ్యతలు నమోదయ్యాయి. నిన్న (364) కంటే ఈరోజు స్వల్పంగా గాలి నాణ్యతలు మెరుగుపడ్డాయి. అయినప్పటికీ గాలి నాణ్యతల స్థాయి వెరీ పూర్‌ కేటగిరీలోనే నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.
కాగా, ఢిల్లీలో కార్లు, బస్సుల నుంచి వచ్చే పొగ వల్లే గాలి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని ఢిల్లీవాసులు చెబుతున్నారు. రోడ్లపై విపరీతంగా కార్లు, బస్సులు, టూవీలర్‌ వాహనాలు నడుస్తున్నాయి. వీటివల్ల ట్రాఫిక్‌జామ్‌తోపాటు, కాలుష్యం కూడా పెరిగిపోతోంది. దీంతో ఢిల్లీవాసులు గాలి కాలుష్యం వల్ల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు అని ఢిల్లీవాసులు ఆవేదన చెందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -