Friday, June 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగా బగ్గలి అజయ్

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగా బగ్గలి అజయ్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడంలో భాగంగా శుక్రవారం బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా బగ్గలి అజయ్ ను నియమించినట్టు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. నగరంలోని కేఆర్ డిగ్రీ కళాశాల ఆవరణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..గతంలో బీసీ యువజన సంఘం నగర అధ్యక్షునిగా పనిచేసిన బగ్గలి అజయ్ బీసీ సంక్షేమ సంఘానికి ఎన్నో రోజులుగా చేస్తున్న సేవలను చూసి గుర్తించి ఈ పదవి ఇవ్వడం జరిగిందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రావాలంటే యువత గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు అన్నారు. యువత సాధించలేనిది ఏమీ లేదని యువత గట్టిగా పోరాడితే అధికార పీఠాలు కూడా కదులుతాయని అన్నారు. బీసీలకు చెందాల్సిన హక్కులు చెందుతాయని రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు బుస్స ఆంజనేయులు ఆకుల ప్రసాద్ దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, విజయ్, గంగాధర్, సాయి, బసవ, చంద్రకాంత్, మురళి, విజయ, సాయిలు, సదానంద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -