- Advertisement -
నవతెలంగాణ – ముంబయి: విమాన ప్రమాదంలో కన్నుమూసిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. గురువారం బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిందే, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, తదితర రాజకీయ ప్రముఖులు అంతక్రియల్లో పాల్గొన్నారు. అజిత్ పవార్‌ను కడసారి చూసేందుకు ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున మైదానానికి వచ్చి పార్టీ అధినేతకు కన్నీటి వీడ్కోలు పలికారు.
- Advertisement -



