నవతెలంగాణ-హైదరాబాద్: ఘోర విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తోపాటు ఫైలట్లు సహాయక సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకొని అధికారులు దర్యాప్తు చేశారు. ఆ ప్రమాదానికి ముందు కాక్‌పిట్‌లో ఉన్న ఇద్దరు పైలట్ల మాట్లాడిన మాటలు అందరినీ వణికిస్తున్నాయి. “ఓహ్ షిట్” అన్న మాటలు వినిపించిన కొద్ది సెకన్లలోనే ఆ విమానం కూలిపోయింది. బుధవారం ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఢిల్లీకి చెందిన వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న లియర్‌జెట్ 45 విమానం, బారామతి టేబుల్‌టాప్ రన్‌వేపై రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 66 ఏళ్ల అజిత్ పవార్, ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, సహాయకుడు, అలాగే విమానం నడిపిన ఇద్దరు పైలట్లైన సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ శంభావి పాఠక్ అందరూ మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదంపై లోతైన విచారణ కోసం విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ నుంచి ప్రత్యేక బృందం బుధవారం సాయంత్రం ప్రమాద స్థలానికి చేరుకుంది. ఫోరెన్సిక్ దర్యాప్తు ప్రారంభమైంది.



