Saturday, June 7, 2025
E-PAPER
Homeసినిమాఘనంగా అఖిల్‌ వివాహం..

ఘనంగా అఖిల్‌ వివాహం..

- Advertisement -

తన బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేశారు అఖిల్‌ అక్కినేని. శుక్రవారం తెల్లవారుజామున ఆయన వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు జైనబ్‌ రవ్జీతో ఆయన వివాహం వేడుకగా జరిగింది. హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో జరిగిన ఈ వివాహ మహోత్సవానికి కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈనెల 8న అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ జరుగనుంది. ఢిల్లీకి చెందిన జైనబ్‌ రవ్జీ థియేటర్‌ ఆర్టిస్ట్‌ మాత్రమే కాదు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కూడా. రెండేళ్ళ క్రితం అఖిల్‌తో మొదలైన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఒక్కటయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -