Tuesday, February 10, 2026
E-PAPER
Homeజిల్లాలుఅండర్-10 ప్రపంచ స్థాయి యోగ పోటీల‌కు అకిరా

అండర్-10 ప్రపంచ స్థాయి యోగ పోటీల‌కు అకిరా

- Advertisement -

నవతెలంగాణ-జుక్కల్: ప్రపంచ స్థాయి అండర్-10 యోగ పోటీలో జుక్క‌ల్ మండ‌లానికి చెందిన అంకీరా ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తోంది. మండలం, డివిజన్, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో ప‌లు ప‌త‌కాలు కైవ‌సం చేసుకుంది. బెంగళూరు వేదిక‌గా నిర్వ‌హించిన ఐయువైఎఫ్ యోగ వరల్డ్ ఛాంపియన్ షిప్-2026లో సిల్వర్ మెడల్‌తో మెరువ‌గా, ఇటివలే కలకత్తాలో నిర్వహించిన అండర్-10 యోగ పోటీలో రజతక పథకం సాధించింది. తాజాగా ప్రపంచ స్థాయి అండర్-10 యోగ పోటీల‌కు ఆమె ఎంపిక కావ‌డంపై జుక్కల్ మండల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇలాంటి అవకాశాలు ఎన్నో అందిపుచ్చుకోవాలని ఆశాభావం వ్య‌క్తం చేశారు. భ‌విష్య‌త్‌లో ఈ త‌ర‌హా విజయాలు ఎన్నో సాధించి మండ‌లానికి మంచి పేరు తెవాల‌ని ఆకాంక్షించారు.

జుక్కల్ మండలానికి చెందిన‌ గొల్ల శ్రీనివాస్ దంపతుల పుత్రిక.. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో అకీరా విద్యనభ్యసిస్తుంది. యోగాలో మంచి నైపుణ్యం చూపిస్తూ, పాఠశాల సాస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శించడంతో యోగ గురువు గాయత్రి ఆమెను తీర్చిదిద్దింది. గ్రామ‌స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో యోగ పోటీల్లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చింది. ప్రపంచ స్థాయిలో అండర్-10 విభాగంలో ర‌న్న‌ర్ నిలిచి రజితం కైవ‌సం చేసుకోవ‌డం అభినంద‌నీయమ‌ని యోగ గురువు గాయత్రి తెలిపారు. అకిరా తల్లిదండ్రులకు ప‌లువురు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -