- Advertisement -
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున సోమవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆయన రావడంతో ఆ మేరకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయన అక్కడి నిర్దేశిత ఫార్మాట్‌లో దరాఖాస్తు నింపి, ఫొటో దిగి, సంతకం చేశారు. అనంతరం ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్ అందజేశారు.
- Advertisement -