నవతెలంగాణ-కంఠేశ్వర్: రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అనుబంధ సంస్థ అయినటువంటి నిజామాబాద్ రోటరీ సర్వీస్ ట్రస్ట్ 2025 -2027 సంవత్సర నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక నిర్వహించామని ఎన్నికల అధికారులు ధర్మపురి సురేందర్, బెజ్జగం అశోక్, రాజ్కుమార్ సుబేదార్ లు తెలిపారు. ఈ సందర్భంగా 2025 – 27 సంవత్సరానికి గాను ట్రస్ట్ చైర్మన్గా ఆకుల అశోక్, వైస్ చైర్మన్‌గా కమల్ ఇనాని, కార్యదర్శిగా జ్ఞాన ప్రకాష్, కోశాధికారిగా బాస ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా హీతెన్ బిమాని, వెలమ ధీరజ్ రెడ్డి, జి. బాబురావ్ కొనసాగుతారని వెల్లడించారు..ఈ సమావేశంలో ట్రస్టు మాజీ చైర్మన్ వేది ప్రకాష్ మిట్టల్, కార్యదర్శి జితేంద్ర మలాని, క్లబ్ అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్, కార్యదర్శి గోవింద్ జవహర్, మాజీ అధ్యక్షులు బీరెల్లి విజయరావు, కార్యదర్శి గంగారెడ్డి తదితర క్లబ్ మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రోటరీ సర్వీస్ ట్రస్ట్ నూతన చైర్మన్‌గా ఆకుల అశోక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES