– నేడు కోర్టులో హాజరు హాజరు పోలీసులు
– బీఆర్ఎస్ కౌన్సిలర్లు కలిసిన కాంగ్రెస్ నేతలు
– పోలీసులను నిలదీసిన బీఆర్ఎస్ నేతలు
– పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు కలవడంపై నిలదీత
నవతెలంగాణ ఇబ్రహీంపట్నం : అదృశ్యం మైన బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి పోలీసుల అదుపులోకి వెళ్లారు. ఆయనను బుధవారం కోర్టులో హాజరు పరచమన్నారు. అందుకు సంబంధించిన వివరాలు.. బీఆర్ఎస్ పార్టీలో అసమతి రాగం ఎత్తుకున్న ఆకుల యాదగిరి మొదటిరోజు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. తమ భర్త అదృశ్యమయ్యారని ఆకుల వసంత ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో మొదటి రోజు ఆకుల యాదగిరి కోసం కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. ఆకుల యాదగిరి వచ్చే వరకు ఎన్నిక నిర్వహించవద్దని భీష్మించారు. అనుకున్నట్లుగానే మొదటి రోజు చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. రెండవ రోజు ఎన్నికకు అధికారులు అవకాశం ఇచ్చారు. కాగా ఇప్పటికే ఆకుల యాదగిరిని రప్పించాలని ఆయన వచ్చే వరకు ఎన్నిక నిర్వహించవద్దని కాంగ్రెస్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఉదయం 11 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఎన్నికల సంఘం ప్రత్యేక అధికారిని నియమించింది. ఉదయం 11 గంటల సమయంలో బీఆర్ఎస్ కూటమి సమావేశం మందిరంలోకి హాజరైంది. వారి వెంటే ఆకుల యాదగిరి కూడా వచ్చారు. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని అనారోగ్యం వల్ల హాస్పిటల్లో చేరాల్చి వచ్చిందని ఆకుల యాదగిరి మీడియాతో ప్రకటించారు. దాంతో కాంగ్రెస్ గేర్ మార్చింది. తమకు సకాలంలో నోటీసులు అందజేయలేదని ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్లేట్ ఫిరాయించింది. చైర్మన్ ఎన్నిక జరగకుండా గందరగోళ వాతావరణాన్ని సృష్టించింది. చివరికి ఎన్నికలు వాయిదా పడిన తర్వాత మిస్సింగ్ కేసుగా నమోదైన ఆకుల యాదగిరిని ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ తరలించారు. నేడు అతన్ని హైకోర్టులో హాజరు పరిచాల్సి ఉంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే పోలీస్ స్టేషన్లో ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకులు యాదగిరిని కాంగ్రెస్ నేత, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఆకుల యాదగిరిని కలిశారు. ఆయనతో మంత్రాలు జరిపారు. ఈ విషయం బీఆర్ఎస్ శ్రేణులకు దవానంలో వ్యాపించడంతో వందలాది మంది కార్యకర్తలు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆకుల యాదగిరిని కలవాల్సింది కుటుంబ సభ్యులు, లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు తప్ప కాంగ్రెస్ నాయకులు ఎలా కలుస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు, సీఐ మహేందర్ రెడ్డితో బీఆర్ఎస్ నేతలు చర్చలు జరుపుతున్నారు.
పోలీసుల అదుపులో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి..
- Advertisement -
- Advertisement -



