నవతెలంగాణ-హైదరాబాద్: అల్ ఫలాహ్ యూనివర్శిటీ చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధికీని ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు. సిద్ధికీని స్థానిక కోర్టులో హాజరుపరచగా, విచారణ కోసం నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించిందని అన్నారు. ఢిల్లీ పేలుళ్లపై యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) ఫిర్యాదు మేరకు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కార్యకలాపాలు ప్రారంభించిన అనంతరం క్రైమ్ బ్రాంచ్ ఈ చర్య చేపట్టింది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుళ్ల తర్వాత అల్ ఫలాహ్ యూనివర్శిటీ కార్యకలాపాల్లో అవకతవకలు మరియు మోసానికి పాల్పడినట్లు క్రైమ్ బ్రాంచ్ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అల్ ఫలాహ్ యూనివర్శిటీ చైర్మన్ అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



