- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇతర బ్యాంక్ ఏటీఎంల్లో నెలకు 5 ఉచిత లావాదేవీల తర్వాత ప్రతి విత్ డ్రాకు రూ.23+జీఎస్టీ వసూలు చేయనుంది. బ్యాలెన్స్ చెక్ చేసినా, మినీ స్టేట్‌మెంట్ తీసినా రూ.11 కట్ కానున్నాయి. శాలరీ ఖాతాదారులకు నెలకు 10 లావాదేవీల వరకు ఉచితం. ఈ పెరిగిన ఛార్జీలు 2025 డిసెంబర్ నుంచే అమలులోకి వచ్చినట్లు SBI పేర్కొంది.
- Advertisement -



