- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమలలో ఎల్లుండి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలను టీటీడీ ప్రారంభించనుంది. ఈ క్రమంలో నేటి నుంచి జనవరి 7 వరకు SSD టోకెన్ల జారీని రద్దు చేసింది. ఈ తేదీల్లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద టోకెన్లు ఇవ్వరు. ఈనెల 30, 31, జనవరి 1 తేదీల్లో ఈ-డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తారు. టోకెన్లు లేనివారిని జనవరి 2 నుంచి 8 వరకు సర్వదర్శనం క్యూలైన్‌లో అనుమతిస్తారు.
- Advertisement -



