- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 10 నుంచి 5 డిగ్రీలకు పడిపోతున్నాయి, ఏజెన్సీ ప్రాంతాల్లో 7 నుంచి 3 డిగ్రీలకు చేరాయి. ఉదయం, సాయంత్రం చలి గాలులతో పాటు భారీగా మంచు కురుస్తోంది. మధ్యాహ్నం కూడా చలి తగ్గడం లేదు. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, జనవరి 14న హైదరాబాద్‌లో వర్షం కురిసే అవకాశం ఉంది. నగరాన్ని మబ్బులు కమ్మేసే అవకాశం ఉందని, వర్షం పడితే చలి మరింత పెరిగి ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిపింది.
- Advertisement -



