Sunday, April 12, 2026
E-PAPER
HomeNewsఇంటర్ ఫలితాల్లో ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరుటౌన్: విద్యాశాఖ ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆలేరు విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించారు. ఎంపీసీ సెకండ్ ఇయర్ విద్యార్థిని పి.సృజన 991 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ర్యాంకు పొందింది. కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని బి.మానస 961 మార్కులు సాధించింది.ఎల్‌.అర్చన బైపిసి ఫస్ట్ ఇయర్ గ్రూపులో 421 మార్కులు సాధించింది. జె.మణిధర్ ఈటి గ్రూపులో 904మార్కులు పొందినాడు. సి ఎచ్ ప్రవీణ్ ఎల్‌ఎంటి గ్రూపులో 906 మార్కులు పొందినాడు.ఎస్‌కే అబ్దుల్ ముకేత్ 808 బైపీసీ,ఇ.మనీషా సిఎస్ గ్రూపులో 481 మార్కులు సాధించింది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పూజారి వెంకటేశ్వర్లు విద్యార్థులను అధ్యాపక బృందాన్ని అభినందించినాడు. పేద విద్యార్థుల కోసం నాణ్యమైన విద్య ప్రభుత్వ కళాశాలలో లభిస్తుందని సకల సౌకర్యాలతో ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నాణ్యమైన విద్యను అందించడానికి సిద్ధంగా ఉందని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులను అధ్యాపకులు అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం అబ్బాస్, రాములు, మధు,జితేందర్ రెడ్డి, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -