నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా అధినేత పుతిన్‌ల మధ్య శుక్రవారం అలాస్కాలో భేటీకానున్నారు. ఈ భేటితో ఉక్రెయిన్-రష్యా మధ్య జరుగుతున్న యుద్ధానికి బ్రేక్ పడనుందని ప్రపంచ శాంతికాముకులు ఆశిస్తున్నారు. రెండు అగ్ర రాజ్యాల అధినేతల సమావేశంతో..యుద్ధ విరామంపై ఓ కొలిక్కి రానున్నారని, దీంతో ఉక్రెయిన్-రష్యా వార్ ముగుస్తుందని ప్రపంచనేతలు భావిస్తున్నారు.
ఫిబ్రవరిలో జెలెన్‌స్కీతో ట్రంప్ భేటీ తర్వాత ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి కుదురుందని అందరూ భావించారు. షరతులు లేని సంధీకి తమ అంగీకరిస్తామని పుతిన్ చెప్పారు. కానీ షరతులేని ఒప్పందానికి తాము అంగీకరించామని, తమ భూభాగాన్ని కోల్పోయే ప్రసక్తే లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. దీంతో ట్రంప్ ప్రయత్నాలకు ఫలితంలేకుండా పోయింది.కాల్పుల విరమణపై మాటకు కట్టుబడి ఉంటారని చెప్పారు. కానీ నెల తిరిగేసరికి రష్యా దాడులు పెరగడంతో ఇరుదేశాల యుద్ధం విరమణ ప్రయత్నాలు సన్నగిల్లాయి. ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామలతో మరోసారి పుతిన్-ట్రంప్ అలస్కా వేదికగా భేటీ కానున్నారు. ఈ భేటీ సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరో వైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారంటూ భారత్‌పై ట్రంప్ రంకెలెస్తున్నా విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఇండియా పరోక్షంగా సహకరిస్తుంది అంటూ..అదనపు సుంకాలు వేశారు. దీంతో భారత్ దిగుమతులపై ఏకంగా 50శాతం టారిప్ విధిస్తున్నామని యూఎస్ ప్రెసిడెంట్ ప్రకటించారు. తాజా చర్చలతో ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ విరమణకు అంగీకరం కుదురుతే..భారత్‌పై సుంకాల భారం తగ్గనుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు.