Tuesday, July 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుGovernment Welfare Hostels: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో అన్ని సదుపాయాలు కల్పించాలి

Government Welfare Hostels: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో అన్ని సదుపాయాలు కల్పించాలి

- Advertisement -

జిల్లా కలెక్టర్ హనుమంతరావు

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో చదివే విద్యార్థిని, విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాలని, వాళ్ళను మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, మైనార్టీ సంక్షేమ, సాంఘిక సంక్షేమ, మహాత్మా జ్యోతిభా పూలే, కస్తూరిభా, గిరిజన సంక్షేమవసతి గృహాల ప్రిన్సిపాల్, స్పెషల్ ఆఫీసర్స్, కేర్ టేకర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. హాస్టల్లో చదివే విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం హాస్టల్స్ లో చదివే విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిందని, రెసిడెన్షియల్ స్కూల్ మీద బాగా నమ్మకం పెరిగిందన్నారు.

చదువుకోడానికి ఎంతో నమ్మకంతో సూదూర ప్రాంతాల నుండి వస్తున్న విద్యార్థులకు హాస్టల్ పరిసర ప్రాంతాలు అలవాటు పడే వరకు విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్స్ శ్రద్ధ పెట్టాలన్నారు. విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితులను తెలుసుకొని, అలాంటి పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తూ వారి పై శ్రద్ధ పెట్టి వారి బాగోగులు చూసుకోవాలన్నారు . విద్యార్థులకు ఎలాంటి అసౌర్యం కలుగకుండా పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యాబోధన చేయాలని తెలిపారు.

మౌలిక వసతులు ఎప్పటికప్పుడు ఎలా ఉన్నాయో చూసుకోవాలి అన్నారు. చిన్న చిన్న రిపేర్ ఉంటే వెంటనే చేయించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు.ఆర్ బి ఎస్ కే టీమ్స్ హాస్టల్ ను సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ సకల సౌకర్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే దిశగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. వంటశాలను ఎప్పుడు కప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వంట చేసేటప్పుడు వంట మీద ఫోకస్ పెట్టి నాణ్యమైన సరుకులు మాత్రమే ఉపయోగించాలన్నారు.

విద్యార్థుల వసతి గదులు, పడకలు, మూతశ్రాలలు, శౌచాలయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలన్నారు.. నూతన మెనూ ప్రకారం సకాలంలో విద్యార్థులు పౌష్టికాహారం అందించాలని, వంట చేసే సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులు మాత్రమే వినియోగించాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని, ప్రతి రోజు వసతి గదులు, వంటశాల, మూత్రశాలలు, పరిసరాలను శుభ్రపరచాలని, విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్ సి ఓ లు, విద్యా రాణి స్వప్న, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య , జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి శ్యామ్ సుందర్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, వివిధ హాస్టల్ ప్రిన్సిపల్స్, స్పెషల్ ఆఫీసర్స్, కేర్ టేకర్ లు సంబందిత అధికారులు పాల్గొన్నారు.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -