- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియాలో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మార్చి 25న మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు, పరిణామాలపై ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నుంచే ప్రతిపక్షాలు పశ్చిమాసియాపై ఉభయసభల్లో చర్చ పెట్టాలని డిమాండ్ చేశాయి. మోడీ సర్కార్ ముందస్తు చర్యలు ఉపక్రమించకపోవడంతో దేశంలో గ్యాస్ కొరత తీవ్ర స్థాయికి చేరిందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రతిపక్షాల ఆందోళనకు దిగొచ్చిన మోడీ సర్కార్ రేపు అఖిల పక్ష భేటికి ఏర్పాటు చేస్తోంది. ఇరాన్ పై ఐదు రోజులపాటు దాడులు చేయమని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
- Advertisement -



