నవతెలంగాణ-హైదరాబాద్: ఈనెల 27న ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజూజి తెలిపారు. పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని మెయిన్ కమిటీ రూమ్‌లో నిర్వహించనున్న ఈ భేటీకి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించిన్నట్లు వెల్లడించారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు ఈ నెల జనవరి 27న ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. అనంతరం ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.ఈ నేపథ్యంలోనే ఆల్ పార్టీ మీటింగ్‌ను కేంద్రం ఏర్పాటు చేయనుంది.



