Tuesday, May 13, 2025
Homeప్రధాన వార్తలుప్రజా సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి

ప్రజా సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి

- Advertisement -

– సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ
– అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 50 వసంతాల స్ఫూర్తి సభ
– ఎస్వీకే నుంచి వీఎస్టీ హాల్‌ వరకు వందలాది మందితో కళా ప్రదర్శన.. జెండా ఆవిష్కరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తన ఆశయసాధనలో మరింత శక్తిని సాధించి ముందుకు సాగాలని, ప్రజాసంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని సినీ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య(ఏసీఎఫ్‌) ఏర్పడి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం స్ఫూర్తి సభ నిర్వహించారు. ముందుగా సుందరయ్య పార్క్‌ నుంచి వీఎస్టీ హాల్‌ వరకు వందలాది మందితో కళా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఖమ్మం జిల్లాకు చెందిన అరుణోదయ సీనియర్‌ కళాకారుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కమిటీ సభ్యులు రాములు జెండాను ఎగరవేశారు. అరుణోదయ, పీడీఎస్‌యూ, పీవోడబ్ల్యూ మూడు విప్లవ ప్రజాసంఘాలకు 50 ఏండ్లు నిండిన సందర్భంగా రూపొందించిన పాటను అంబిక, సావనీర్‌ పుస్తకాన్ని ఎనిశెట్టి శంకర్‌ ఆవిష్కరించారు. ఇటీవల మృతిచెందిన సాహితీవేత్త, పరిశోధకుడు.. అరుణోదయ మిత్రుడు ముత్యం స్మారక హాల్‌(ఎస్వీకే)లో జరిగిన సభకు ఏసీఎఫ్‌ రెండు తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షులు విమలక్క అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అరుణోదయకు అభినందనలు తెలిపారు. ప్రజా సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆకాంక్షించారు.
జన సాహితి అధ్యక్షులు దివి కుమార్‌, మానవ హక్కుల వేదిక జీవన్‌ కుమార్‌, ప్రొఫెసర్‌ కొండా నాగేశ్వరావు, ఎనిశెట్టి శంకర్‌, డాక్టర్‌ ఎ.కె.ప్రభాకర్‌, కొల్లాపురం విమల మాట్లాడారు. నక్సల్బరీ ఉద్యమం నుంచి శ్రీకాకుళం, గోదావరిలోయ ఉద్యమాల ప్రేరణతో అరుణోదయ సంస్థ 1974లో ఆవిర్భవించిందన్నారు. కుల వ్యవస్థ నిర్మూలన పోరాటాలు, పర్యావరణ, బహుజన బతుకమ్మ, స్త్రీల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లిందన్నారు. అమ్మ నవల సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో.. విమలక్క కూడా తెలంగాణ సమాజాన్ని తన పాట, మాట ద్వారా ఎంతగానో ప్రభావితం చేశారన్నారు. అరుణోదయ అంటే ఒక ఉద్యమం అన్నారు. ఫాసిజంపై పోరాడాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉందని, అరుణోదయ తన కృషి ఇంకా ముందుకు కొనసాగించాల్సి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్‌ పోతుల, భుజంగరావు, జీవన్‌ కుమార్‌, కట్టా భగవంత రెడ్డి, పవన్‌, సంతోష్‌, ఏపూరి మల్సుర్‌, రాకేష్‌, అనిత(అరుణోదయ), ప్రొఫెసర్‌ కాసిం, మోత్కూరు శ్రీనివాస్‌, అరుణ పీవోడబ్య్లూ (స్త్రీవిముక్తి), ఆర్‌సీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు పట్లోళ్ల నాగిరెడ్డి, ఏపీ ఏసీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజ్ఞానమ్మ, సుధాకర్‌, రాము పవర్‌ (ముంబయి), బీఎస్‌ రాములు, ప్రొఫెసర్‌ లక్ష్మి, కాకి భాస్కర్‌, విరసం వరలక్ష్మి, జిలుకర శ్రీనివాస్‌, కోలార్‌ శాంతమ్మ(కర్నాటక), రాయలసీమ కళావేదిక వెంకటసుబ్బయ్య, సుంకులు(ఏపీఆర్‌సీఎస్‌), ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు మల్లేష్‌, ఏపీ రాష్ట్ర నాయకులు కరీం భాష, ఏపీ పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకులు సతీష్‌, విశాఖ అరుణోదయ నాయకులు మస్తాన్‌, డప్పు భాస్కర్‌ (వస్తాది బిస్మిల్లాఖాన్‌ అవార్డు గ్రహీత), ప్రజాకళామండలి సత్తన్న, అరుణోదయ విజరు, గద్దర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సూర్యం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -