- Advertisement -
- – 7వ బెటాలియన్ దర్బార్ పరేడ్..
– హాజరైన డి.ఐ.జి టి.జి.యస్.పి బెటాలియన్స్ సి సన్ని..
నవతెలంగాణ – డిచ్ పల్లి - పోలిస్ సిబ్బంది విధినిర్వహణలో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఉన్నతాధికారుల సున్నాలు సూచనలు సలహాలు పాటించాలని టి జి ఎస్ పి బెటాలియన్ డి ఐ జి సి సన్నీ సూచించారు.
- తెలంగాణ ప్రత్యేక పోలిస్ 7వ బెటాలియన్ డిచ్ పల్లి లో వార్శిక తనిఖి లో భాగంగా మంగళవారం బెటాలియన్ కమాండెంట్ పి. సత్యనారయణ అద్వర్యంలో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో ఇన్స్ పెక్షన్ పరేడ్ నిర్వహించారు.ఈ పరేడ్ కమాండర్గా వ్యవహరించిన అసిస్టెంట్ కమాండెంట్ కె.పి సత్యనారయణ డి.ఐ.జి టి.జి.యస్.పి బెటాలియన్స్ సి. సన్ని పరేడ్కు హజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం బెటాలియన్ సిబ్బంది, ఆధికారులకు దర్బార్ నిర్వహించి సిబ్బంది యొక్క అవసరాలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా డి.ఐ.జి మాట్లాడుతూ సిబ్బంది విధినిర్వహణలో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాడనికి మంచి ఆహారం, తగినంత వ్యాయమం మరియు యోగా వంటివి చెయాలని తెలిపారు. అనంతరం బెటాలియన్ అవరణంలో మొక్కను నాటారు.ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమాండెంట్ కె.పి శరత్ కుమార్, అర్.ఐలు కె. త్రిముఖ్, ఏ. నవనిత్ కుమార్, బి. వసంత్ రావు, అర్.యస్.ఐలు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -