Friday, September 26, 2025
E-PAPER
Homeఆటలుజట్టు ప్రణాళికల్లో నేనున్నానా?

జట్టు ప్రణాళికల్లో నేనున్నానా?

- Advertisement -

సూపర్‌కింగ్స్‌తో అశ్విన్‌
చెన్నై :
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2026 సీజన్‌లో జట్టు ప్రణాళికలు ఎలా ఉన్నాయి, తనను ఏ విధంగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారని చెన్నై సూపర్‌కింగ్స్‌ యాజమాన్యాన్ని వెటరన్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన అశ్విన్‌ అడిగినట్టు సమాచారం. మెగా వేలంలో రూ.9.75 కోట్లకు సూపర్‌కింగ్స్‌ గూటికి చేరుకున్న అశ్విన్‌.. ఈ ఏడాది సీజన్‌లో 9 మ్యాచులే ఆడాడు. ఐపీఎల్‌ అరంగేట్రం తర్వాత ఓ సీజన్‌లో 12 కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడటం అశ్విన్‌కు ఇదే ప్రథమం. ఐపీఎల్‌ మినీ వేలం సహా ప్లేయర్‌ ట్రేడింగ్‌కు సమయం ఉండగానే అశ్విన్‌ తన ప్రాంఛైజీ ప్రణాళికలను అడగటం గమనార్హం. ఒకవేళ జట్టు ప్రణాళికల్లో అశ్విన్‌ ఇమడలేని పరిస్థితుల్లో.. వేలంలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాననే సమాచారం సూపర్‌కింగ్స్‌కు అశ్విన్‌ పంపినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అశ్విన్‌, సూపర్‌కింగ్స్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -