- Advertisement -
హైదరాబాద్ : ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (ఎఎం/ఎన్‌ఎస్) తెలంగాణలో తమ ఆప్టిగల్‌ౖ శ్రేణి కలర్ కోటెడ్ స్టీల్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపింది. ఇక్కడ ఆప్టిగల్‌ౖ ప్రైమ్ (15 సంవత్సరాల వారంటీ) ఆప్టిగల్‌ౖ పినాకిల్ (25 సంవత్సరాల వారంటీ) ఉత్పత్తులు లభిస్తాయని పేర్కొంది. ఈ ప్రామాణిక తుప్పు నిరోధక ఉక్కు ఉత్పత్తులు తెలంగాణలోని వేగవంతమైన మౌలిక సదుపాయాల అవసరాలకు అనుగుణంగా ఉంటాయని పేర్కొంది. పేటెంట్ సాంకేతికతతో రూపొందిన ఈ ఉత్పత్తులు, పట్టణ, తీరప్రాంత,, పారిశ్రామిక వాతావరణాల్లో దీర్ఘకాల మన్నికను అందిస్తాయని ఆ సంస్థ డైరెక్టర్ రంజన్ ధర్ తెలిపారు.
- Advertisement -