Tuesday, September 30, 2025
E-PAPER
Homeబీజినెస్అమెజాన్  ఫ్రెష్, భారతదేశంలో 270కి పైగా పట్టణాలకు విస్తరించింది

అమెజాన్  ఫ్రెష్, భారతదేశంలో 270కి పైగా పట్టణాలకు విస్తరించింది

- Advertisement -

నవతెలంగాణ – బెంగుళూరు: అమెజాన్ ఇండియా ఈ రోజు, ప్రస్తుతం జరుగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా దేశవ్యాప్తంగా 270కి పైగా పట్టణాలకు అమెజాన్ ఫ్రెషన్ ను విస్తరింపజేస్తున్నట్లు ప్రకటించింది. తాజా పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులు, గృహావసర వస్తుసామాగ్రులు, స్థానికంగా ప్రజలు మెచ్చిన వస్తువులతో సహా దైనందిన అవసరాలకు కావలసిన వస్తువులను భారతదేశవ్యాప్తంగా లక్షలాది కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావటానికి అమెజాన్ కట్టుబడి ఉన్నదనటానికి ఈ మైలురాయి నిలువుటద్దం. కొత్తగా చేరిన పట్టణాల్లో, ఉత్తరాదిన గోరఖ్ పుర్, డెహ్రాడూన్, జాలంధర్, మరియు జిర్కాపూర్; దక్షిణాదిన కోయంబత్తూర్, నెల్లూరు, హస్సన్, కొడగు, వరంగల్, విజయనగరం, వెల్లోర్, తిరుపతి, కొట్టాయం, కోళ్ళం, హుబ్లి; తూర్పున జమ్షడ్పూర్, ఆసన్సోల్, ఇంకా దుర్గాపూర్; ఇంకా మరెన్నో ఉన్నాయి.

అమెజాన్ ఫ్రెష్, Amazon.in వారి సమగ్ర గ్రోసరీ సేవ. దీని ద్వారా విక్రేతలకు, తాజాగా పండించిన పండ్లు మరియు కూరగాయలు మొదలుకుని గృహావసరాల వరకు, పలు వస్తువులను, సౌకర్యవంతమైన రెండు-గంటల డెలివరీ స్లాట్లలో ఆఫర్ చేసే అవకాశం లభిస్తుంది. అమెజాన్ ఫ్రెష్ విక్రేతలు 40,000లకు పైగా ఉత్పత్తులతో కూడిన ఒక సమగ్రమైన సెలక్షన్ ను ఆఫర్ చేస్తున్నారు. 2023లో ఆఫర్ చేసిన కేవలం 4,000 ఉత్పత్తులతో పోలిస్తే ఇది పది రెట్లు. వీటిలో, తాజా పండ్లు మరియు కూరగాయలు, వరిధాన్యాలు, పాల ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, ఫ్రోజెన్ ఐటమ్స్, సౌందర్య, శిశు మరియు వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, పెంపుడు జంతువులకు కావలసిన వస్తువులు, ఇంకా ఎప్పటికప్పుడు పెరుగుతున్న స్థానిక ఉత్పత్తుల పోర్ట్ ఫోలియో ఉన్నాయి. రాజధానీ గోధుమపిండి, ఈస్టర్న్ మసాలాలు మొదలుకుని GRB స్వీట్స్ మరియు శ్రీ భాగ్యలక్ష్మి వరిధాన్యాల వంటి 3,000లకు పైగా స్థానికంగా మెప్పు పొందిన ఉత్పత్తులతో – కస్టమర్లు తమ దైనందిన అవసరాలకు కావలసిన వస్తువుల కోసం షాపింగ్ చేసుకుంటూనే తమ అభిరుచులు, ప్రాధాన్యతలు, సాంప్రదాయలకు అనుగుణమైన ఉత్పత్తులను పొందగలుగుతారు.

“అమెజాన్ ఫ్రెష్, కేవలం రెండేళ్ళ కాలంలో, చేరిక విషయంలో 4.5 రెట్లు పెరిగింది, ఎంపిక విషయంలో 10 రెట్లు పెరిగింది. దీనితో, భారతదేశవ్యాప్తంగా కుటుంబాలు తమ గ్రోసరీలను ఆన్­లైన్లో కొనే పద్ధతినే మార్చివేస్తోంది,” అని  శ్రీకాంత్ శ్రీ రామ్, డైరెక్టర్ అమెజాన్ ఫ్రెష్ ఇండియా అన్నారు. “270కి పైగా పట్టణాలకు విస్తరించటం ద్వారా మేము గృహావసరాలు మరియు పండుగల్లో ప్రజలు మెచ్చే వస్తువులను గతంలో కంటే ఎక్కువ ఇళ్ళకు అందుబాటులోకి తీసుకువస్తున్నాము. అమెజాన్ ఫ్రెష్ విక్రేతల నెట్­వర్క్ విస్తరించిన కారణంగా, పట్టణాల వ్యాప్తంగా వారి ఉనికి పెరిగిన కారణంగా, దానితోపాటుగా అమెజాన్ వారి అధునాతన డెలివరీ సామర్ధ్యాల కారణంగా, భారతదేశంలో సర్వత్రా లభించే గ్రోసరీ నెట్వర్కును ఏర్పాటు చేయటం సాధ్యమయ్యింది. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా మేము తాజాదనాన్ని, పొదుపును, మరియు సౌలభ్యాన్ని డెలివర్ చేయటం పై దృష్టి సారించాము. తద్వారా కస్టమర్లకు, వారికి కావలసినవి అన్నీ లభించేట్లు, తాము అబిమానించే వ్యక్తులతో ఎక్కువ సమయం పండుగ క్షణాలను గడిపే అవకాశాన్ని కలిగిస్తున్నాము.”

అమెజాన్ ఫ్రెష్ లో ఒక విక్రేత అయిన వినోద్ నంబియార్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మోర్ రీయెటిల్ లిమిటెడ్ (MRL), ఇలా అన్నారు “అమెజాన్ ఫ్రెష్ లో సాధించిన అభివృద్ధి మాకు ఆనందాన్ని కలిగిస్తోంది. 370కి పైగా మా మోర్ ఆఫ్ లైన్  స్టోర్లను అమెజాన్ ఫ్రెష్ కస్టమర్లకు కూడా సేవలు అందించే విధంగా మలిచాము. దీనితో, అమెజాన్ ఫ్రెష్ లో మా వ్యాపారం, 2024లో ఏటి-కా-యేడు పద్ధతిలో 65 శాతం పెరగటమే కాక, గణనీయంగా పెరగటం కొనసాగుతోంది.

అమెజాన్ ఫ్రెష్ విక్రేతలు, భారతదేశవ్యాప్తంగా రిజిస్టర్ చేసుకుని ఉన్న 13,000ల మందికి పైగా రైతులతో ప్రత్యక్షంగా భాగస్వామ్యం ఏర్పపుచుకుని, పొలం-నుండి-గుమ్మం వద్దకు చేర్చే ఒక పటిష్టమైన నెట్వర్కును ఏర్పాటు చేశారు. కస్టమరుకు డెలివర్ చేసే ప్రతి వస్తువు, నాలుగు-అంచెల తీవ్రస్థాయి నాణ్యతా పరీక్షాప్రక్రియలను ఎదుర్కుంటుంది: స్థానిక కలెక్షన్ పాయింట్లు, గ్రేడింగ్ & సార్టింగ్, ఉష్టోగ్రతను-నియంత్రించే స్టోరేజ్ వద్ద, చివరకు నాణ్యతా పరీక్షల వద్ద తనిఖీ చేయబడతుంది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సందర్భంగా కస్టమర్లు, కేవలం ₹1*తో ప్రారంభమయ్యే డీల్స్ మొదలుకుని పండుగ ఆఫర్లను పొంది, తమ పండుగ గ్రోసరీ షాపింగు పై గరిష్ఠంగా* ₹400ల క్యాష్ బ్యాక్ తో అదనపు సొమ్మును ఆదా చేసుకోవచ్చు.  లైట్లు, రంగోలీ కిట్లు, సాంప్రదాయబద్ధమైన మిఠాయిలతో సహా కొత్తగా విడుదల చేసిన దీపావళి డెకోర్ ఎసెన్షియల్సును వారు షాపింగ్ చేసుకోగలుగుతారు. ప్రతి వారాంతంలో అమెజాన్ ఫ్రెష్ సూపర్ వాల్యూ డేస్, వారపు గ్రోసరీ బాస్కెట్లు మరియు దైనందిన గృహావసర ఉత్పత్తుల పై అదనంగా సొమ్మును పొదుపు చేసుకునే అవకాశాన్ని ఆఫర్ చేస్తున్నాయి. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -