నవతెలంగాణ – బెంగళూరు: ఆన్ లైన్ షాపింగ్ వృద్ధిని ఉత్తమంగా వినియోగించడానికి కంటెంట్ క్రియేటర్లను ప్రారంభించడానికి తమ ప్రాధాన్యతలో భాగంగా అమేజాన్ ఇండియా తమ టెక్ ఇన్ ఫ్ల్యూయెన్సర్ ప్రోగ్రాం (TIP) ను ప్రకటించింది. ప్రోగ్రాం ద్వారా, అమేజాన్ స్మార్ట్ ఫోన్లు, కెమేరాలు, మరియు ఇంకా ఎన్నో అలాంటి ఉత్పత్తుల కోసం కస్టమర్లకు సహాయపడే కంటెంట్ ను సృష్టించడానికి సాధనాలు మరియు వ్యవస్థలను పొందే సౌలభ్యంతో అన్ని పరిమాణాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లను కేటాయిస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన అమేజాన్ బెస్ట్ ఇన్ టెక్ అవార్డ్స్ లో ప్రకటించబడిన ఈ ప్రోగ్రాం క్రియేటర్లు తమ కంటెంట్ ను డబ్బు రూపంలో పొందడానికి వారికి సహాయపడుతుంది మరియు వారి అనుచరులకు షాపింగ్ ను సులభతరం చేస్తుంది.
“కస్టమర్లు ఈరోజు ఉత్పత్తులను కనుగొనడంలో, పరిశోధించడంలో మరియు కొనుగోలు చేయడానికి కేంద్రీయంగా ఉన్నారు”, అని నిధి ఠక్కర్, హెడ్ ఆఫ్ క్రియేటర్స్ ప్రోగ్రాం, అమేజాన్ ఇండియా అన్నారు. “టెక్ ఇన్ ఫ్ల్యూయెన్సర్ ప్రోగ్రాంతో, కస్టమర్లు మరింత అవగాహనతో కూడిన కొనుగోలు నిర్ణయాలు చేయడంలో సహాయపడుతూనే క్రియేటర్లు విజయం సాధించేలా వారిని సమర్థవంతంగా చేసే మా కలపై రెట్టింపు దృష్టి సారిస్తున్నాం మరియు సమస్యలు లేకుండా షాపింగ్ అనుభవాన్ని నిర్థారిస్తున్నాం.”
కస్టమర్లు మరియు కంటెంట్ క్రియేటర్ల అవసరాలపై అభివృద్ధి చేయబడిన అమేజాన్ ఇన్ ఫ్ల్యూయెన్సర్ ప్రోగ్రాం ఇప్పుడు టెక్నాలజీ, ఫ్యాషన్ , జీవనశైలి, పేరెంటింగ్, ఫిట్ నెస్, మరియు ఇంకా ఎన్నో వాటిలో 1 లక్షకు పైగా క్రియేటర్లను కలిగి ఉంది. ఈ కార్యక్రమం క్రియేటర్లు తమ ప్రేక్షకులతో ప్రామాణికమైన భాగస్వామాన్ని పెంచుకుంటూ, సంపాదకీయ స్వేచ్ఛతో అనుకూలంగా చేయబడిన అనుబంధ కంటెంట్ ను రూపొందించడం ద్వారా తమ సృజనాత్మక దృష్టిని కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది. క్రియేటర్లు amazon.in పై తమ కంటెంట్ ను విస్తరించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో కనక్ట్ అవడం ద్వారా తమ పరిధిని విస్తరించుకోవచ్చు. సమీర రెడ్డి, రాజీవ్ మఖని మరియు అంకూర్ వరికూ వంటి ప్రసిద్ధి చెందిన కంటెంట్ క్రియేటర్లు, సెలబ్రిటీలు, మరియు నిపుణులు ప్రోగ్రాంలో భాగంగా ఉన్నారు మరియు amazon.in ద్వారా తమ కమ్యూనిటీతో కలిసి ఆనందిస్తున్నారు.
ఉత్పత్తి విడుదలలు మరియు డీల్స్ ను త్వరగా పొందడానికి, సకాలంలో కంటెంట్ ను సృష్టించడం ప్రారంభించడానికి అమేజాన్ వారి TIP టెక్ క్రియేటర్లకు సాధికారత కల్పిస్తోంది. సంభాషణలను ప్రోత్సహించడానికి ఇది పోటీయుతమైన కమిషన్ వ్యవస్థను, ఆధునిక పద్ధతులపై శిక్షణ, ప్రత్యేకమైన అనుబంధ సాధనాలు మరియు అత్యధికంగా చేరుకోవడానికి వ్యూహాలను అందిస్తోంది. క్రియేటర్లు బ్రాండ్ డీల్స్ మరియు మానిటైజేషన్ అవకాశాలను పొందడాన్ని మరియు ఆధునిక వర్క్ షాప్స్, ప్రత్యేకమైన ఘటనలు మరియు తోటి వారితో నెట్ వర్కింగ్, బ్రాండ్స్ మరియు అమేజానా నాయకులను ఆనందించవచ్చు. సాటిలేని వ్యవస్థలు మరియు అవకాశాలతో క్రియేటర్లకు సాధికారత కల్పించడం ద్వారా, TIP భారతదేశపు టెక్ క్రియేటర్ ఆర్థిక వ్యవస్థ కోసం శక్తివంతమైన మద్దతు వ్యవస్థను సృష్టించే లక్ష్యాన్ని కలిగి ఉంది.
ఇన్ ఫ్ల్యూయెన్సర్స్ నేర్చుకోవడానికి, పాల్గొనడానికి మరియు అభివృద్ధి చెందడానికి మాధ్యమాన్ని కేటాయించే అమేజాన్ లైవ్, అమేజాన్ ఇన్ ఫ్ల్యూయెన్సర్ ప్రోగ్రాం, క్రియేటర్ సెంట్రల్, క్రియేటర్ యూనివర్శిటీ, ఎలివేట్, మరియు క్రియేటర్ కనక్ట్ వంటి ప్రోగ్రాంతో భారతదేశంలో క్రియేటర్ నెట్ వర్క్ లో పెట్టుబడి పెట్టడాన్ని అమేజాన్ కొనసాగిస్తోంది.