Wednesday, April 30, 2025
Homeబీజినెస్సరికొత్త Kindle పేపర్‌వైట్‌ను విడుదల చేసిన Amazon

సరికొత్త Kindle పేపర్‌వైట్‌ను విడుదల చేసిన Amazon

Amazon నేడు, భారతదేశంలో తన సరికొత్త Kindle పేపర్‌వైట్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఇప్పటివరకు కంపెనీ విడుదల చేసిన వాటిల్లో అత్యంత వేగవంతమైన Kindle కాగా, ఇప్పటివరకు అత్యుత్తమ పనితీరు కనబరిచిన, సన్నని Kindle పేపర్‌వైట్. ఇది ఏ పేపర్‌వైట్‌లోనూ లేనంతగా 7 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను, తేలికైన డిజైన్, ఒకే ఛార్జ్‌తో 12 వారాల వరకు బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంటుంది.

వినియోగదారులు www.amazon.in/all-new-kindle-paperwhiteలో ₹16,999 ధరకు బ్లాక్ కలర్‌లో సరికొత్త Kindle పేపర్‌వైట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ‘‘Kindle పేపర్‌వైట్ పలు సంవత్సరాలుగా పాఠకులకు ప్రధానమైన ఎంపికగా ఉంది. మా వినియోగదారులకు విలువైన అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్‌లతో సరికొత్త Kindle పేపర్‌వైట్‌ను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉంది. ఇది 25% వేగవంతమైన పేజీ టర్న్‌లతో వేగవంతమైన పనితీరును, వినియోగదారులు చదువుతున్నప్పుడు ఎప్పుడూ జాప్యం లేకుండా చేస్తుంది. దీని అతిపెద్ద డిస్‌ప్లే అదనపు పఠన సౌకర్యాన్ని అందిస్తుంది. దీని తేలికైన డిజైన్ ప్రయాణంలో తీసుకెళ్లడానికి, చదవడానికి సౌకర్యంగా ఉంటుంది” అని Amazon డివైసెస్ ఇండియా డైరెక్టర్ మరియు కంట్రీ మేనేజర్ దిలీప్ ఆర్.ఎస్. అన్నారు. “ఈ తాజా కిండిల్‌తో అమెజాన్‌లో అందుబాటులో ఉన్న భారతీయ, అంతర్జాతీయ టైటిళ్ల విస్తారమైన ఎంపిక నుంచి కథనాలను అన్‌లాక్ చేసేందుకు మా వినియోగదారుల నుంచి మేము వేచి చూస్తున్నాము’’ అని తెలిపారు. 

మెరుగైన పనితీరు కోసం తయారైంది.

కొత్త Kindle పేపర్‌వైట్ శక్తివంతమైన డ్యూయల్-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది పరికరంలో 25% వేగవంతమైన పేజీ టర్న్‌లతో మృదువైన, వేగవంతమైన పనితీరును అందిస్తుంది. ఇది మెరుగైన కీవర్డ్ టచ్-రెస్పాన్స్‌ను కూడా కలిగి ఉంది. వినియోగదారులు తమ Kindle పరికరాన్ని సజావుగా నావిగేట్ చేసేందుకు, వారి లైబ్రరీలను సులభంగా బ్రౌజ్ చేయడానికి అనుమతిస్తుంది. USB-C ద్వారా ఒకే ఛార్జ్‌తో, వినియోగదారులు తమ పరికరంలో 12 వారాల వరకు బ్యాటరీ లైఫ్‌ను ఆస్వాదించవచ్చు.

అతిపెద్ద పేపర్‌వైట్ డిస్‌ప్లే మరియు మెరుగైన పోర్టబిలిటీ

కొత్త Kindle పేపర్‌వైట్ 7-అంగుళాల వాటర్‌ప్రూఫ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది పేపర్‌వైట్‌కు అతిపెద్దది – మరియు సన్నని బోర్డర్‌తో, మెరుగైన పఠన అనుభవం కోసం పెద్ద స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని అందిస్తుంది. దీని డిస్‌ప్లే ఆక్సైడ్ థిన్-ఫిల్మ్ ట్రాన్సిస్టర్‌ను ఉపయోగిస్తుంది. ఇది ఏదైనా Kindle పేపర్‌వైట్  అత్యధిక కాంట్రాస్ట్ నిష్పత్తిని ఇస్తుంది. కనుక, టెక్ట్స్, చిత్రాలు స్క్రీన్ నుంచి పాప్ అవుతాయి. ఇది ఇప్పటివరకు ఉన్న వాటిలో అత్యంత సన్నని పేపర్‌వైట్. దీని సరళమైన డిజైన్ ఎక్కడికైనా తీసుకెళ్లడానికి సౌకర్యంగా ఉంటుంది. దీని 300 ppi గ్లేర్-ఫ్రీ డిస్‌ప్లే ప్రకాశవంతమైన కాంతిలోనూ కాగితం లాగా చదువుకునేందుకు అనుమతిస్తుంది. సర్దుబాటు చేయగల చక్కని కాంతి మరియు చీకటి మోడ్‌తో, పాఠకులు తమ ఇష్టానికి అనుగుణంగా డిస్‌ప్లేను అనుకూలీకరించవచ్చు. బయట ఉన్నప్పుడు మరియు సూర్యకాంతిలో లేదా మసకబారిన ప్రదేశంలో ఉన్నా, వారు పుస్తకాలను హాయిగా చదవుకోవచ్చు. అలాగే, దీని 16GB నిల్వ సామర్థ్యం కస్టమర్‌లు ప్రయాణంలో వేల పుస్తకాలను స్టోర్ చేసుకునేందుకు, యాక్సెస్ చేయడానికి తగినంత స్థలాన్ని కలిగి ఉండేలా చేస్తుంది.

వినియోగదారులకు ఉద్దేశించిన పఠన పరికరాన్ని అందించేందుకు Amazon దృష్టికి అనుగుణంగా Kindle పేపర్‌వైట్ తయారైంది. తద్వారా వారు ఇ-మెయిల్‌లు, టెక్ట్స్‌లు, సోషల్ మీడియా వంటి అంతరాయాల నుండి తప్పించుకోవచ్చు. రచయిత రాసిన కథలో నిజంగా మమేకం కావచ్చు. ఇది కిండిల్‌లో పఠన అనుభవం గురించి వినియోగదారులకు తెలిసిన, ఇష్టపడే లక్షణాలతో నిండి ఉంది. X-Ray వంటి కొన్ని కస్టమర్ ఇష్టమైనవి, పుస్తకంలో పేర్కొన్న వ్యక్తులు లేదా ప్రదేశాల గురించి ముఖ్యమైన వివరాలను మరియు ఏదైనా పదాలు మరియు అనువాదాలను త్వరగా వెతకడానికి అంతర్నిర్మిత నిఘంటువును అందిస్తాయి. కొత్త భాషను నేర్చుకునే వారికి, వర్డ్ వైజ్ కష్టమైన పదాల పైన ఆటోమేటిక్‌గా కనిపించే చిన్న, సరళమైన నిర్వచనాలను అందిస్తుంది. ఇది వినియోగదారులు పదాలకు అర్థాల కోసం మరెక్కడా చూడాల్సిన అవసరం లేకుండా చదవడాన్ని కొనసాగించేందుకు సహాయపడుతుంది.

Kindle యాప్‌లో iOS, Android కోసం సరళీకృత సెటప్ ద్వారా పరికరాన్ని తక్కువ దశల్లో నమోదు చేసుకోవడానికి, మరింత వేగంగా పుస్తకంలోకి ప్రవేశించేందుకు ఒక ఎంపికను అందిస్తుంది.

ప్రపంచంలోని అత్యుత్తమ ఈబుక్ స్టోర్‌కు యాక్సెస్ 

కొత్త Kindle పేపర్‌వైట్‌తో, కస్టమర్‌లు అమెజాన్‌లో ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల 1.5 కోట్లకు పైగా టైటిల్‌ల విస్తృత ఎంపికను అన్వేషించవచ్చు. హిందీ, తమిళం మరియు మరాఠీ వంటి భాషలలో ఈ-బుక్‌లను కూడా ఆస్వాదించవచ్చు. Kindle Unlimited సబ్‌స్క్రైబర్‌లు 20 లక్షలకు పైగా ఈబుక్‌లకు అపరిమిత యాక్సెస్ నుంచి ప్రయోజనం పొందుతారు. Amazon Prime members అదనపు ఖర్చు లేకుండా ఎంపిక చేసిన ఈ-బుక్‌ల రొటేటింగ్ కేటలాగ్‌ను యాక్సెస్ చేయవచ్చు.

ధర – లభ్యత

all-new Kindle Paperwhite Amazon.inలో బ్లాక్ కలర్‌లో ₹16,999 ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. 

వినియోగదారులు తమ Kindle పేపర్‌వైట్ కవర్‌లను Black, Marine Green మరియు Tulip Pink రంగుల్లో ₹1,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img