భారతదేశంలో అత్యంతగా ఉపయోగించే సహ–బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ మెరుగుదల
అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఫారెక్స్ రుసుములను తగ్గిస్తుంది,
షాపింగ్, ప్రయాణ బుక్కింగ్స్ పై 5% అపరిమితమైన రివార్డ్స్ ను కొనసాగిస్తోంది
నవతెలంగాణ ముంబయి: అమేజాన్ మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం తమ దీర్ఘకాలం భాగస్వామ్యాన్ని నవీకరించామని అమేజాన్, ICICI బ్యాంక్ లు ఈరోజు ప్రకటించాయి. ఇది భారతదేశంలో 5 లక్షలకు పైగా కస్టమర్లతో అత్యంతగా వినియోగించబడే సహ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. ఇది 2018లో ప్రారంభమైన నాటి నుండి, కార్డ్ సరళమైన, నిజాయితీ గల బహుమానాలు, నిరంతరమైన సౌకర్యం ద్వారా డిజిటల్ చెల్లింపుల్ని పునర్నిర్వచించింది.
అక్టోబర్ 11, 2025 నుండి అమలయ్యే, అమేజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అంతర్జాతీయ లావాదేవీలపై ఫోరెక్స్ మార్క్అప్ ను తగ్గిస్తుంది. ప్రైమ్ సభ్యుల కోసం అమేజాన్ పే ద్వారా చేసిన షాపింగ్, ట్రావెల్ బుక్కింగ్స్ పై కార్డ్ తమ సిగ్నేచర్ ప్రయోజనాలు 5% అన్ లిమిటెడ్ క్యాష్ బాక్ ను, నాన్-ప్రైమ్ సభ్యుల కోసం 3% అన్ లిమిటెడ్ రివార్డ్స్ ను కొనసాగిస్తుంది. ఈ ఫీచర్లతో, కార్డ్ భారతదేశంలోని అత్యంత బహుమానపూర్వకమైన రోజూవారీ క్రెడిట్ కార్డ్ నుండి మీ పరిపూర్ణమైన ప్రయాణ సహచరునిగా కూడా అభివృద్ధి చెందింది. రోజూవారీ ఖర్చులు, ప్రయాణ అనుభవాలు రెండింటిలోను ఎక్కువ విలువను అందిస్తుంది.
మాయంక్ జైన్, డైరెక్టర్- క్రెడిట్ & లెండింగ్, అమేజాన్ పే ఇండియా మాట్లాడుతూ“ఈ ప్రయోజనాలతో, మేము భారతదేశపు అత్యంత నమ్మకమైన సహ-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ను కొత్త స్థాయిలకు తీసుకువెళ్తున్నాం. మాకు గల 5 లక్షలకు పైగా విలువైన కస్టమర్లు నిరంతరంగా అపరిమితమైన క్యాష్ బ్యాక్, జీరో జాయినింగ్, వార్షిక ఫీజు మరియు నిరంతరంగా రిడంప్షన్ సదుపాయాలను ఆనందించారు. మా కస్టమర్ల తరపున ఆవిష్కరించడానికి, రోజూవారీ అవసరాలు నుండి ఇప్పుడు ప్రయాణం వరకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే శ్రేణుల్లో బహుమానాలను శక్తివంతం చేయడానికి మేము కట్టుబడ్డాము. ఈ పెంపుదల అనేది తమ రోజూవారీ జీవితాల్లో భారతీయులు ఎలా క్రెడిట్ విలీనంచేయడం పట్ల మా స్థిరమైన కస్టమర్ నిమగ్నత, నిబద్ధతలను సూచిస్తోంది.” అని అన్నారు.
విపుల్ అగర్వాల్, హెడ్- కార్డ్స్ & పేమెంట్ సొల్యూషన్స్, ICICI బ్యాంక్ మాట్లాడుతూ“అమేజాన్ పే ICICI క్రెడిట్ కార్డ్ దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సహ-బ్రాండెడ్ కార్డ్స్ లో ఒకటి. అమేజాన్ పేతో మా భాగస్వామ్యాన్ని నవీకరించడానికి, మా కస్టమర్లకు ఒక మెరుగైన ప్రతిపాదనను అందించడానికి మేము ఆనందిస్తున్నాము. భారతదేశపు కస్టమర్లలో ప్రయాణాల ధోరణితో పాటు, గొప్ప రివార్డ్ ప్రతిపాదనలు, సరళమైన రిడంప్, ఆప్షన్స్ కోసం డిమాండ్ పెరిగిందని పెరిగిందని మేము గమనించాము. ఫోరెక్స్ మార్క్ అప్ ను తగ్గించడం ద్వారా, చెల్లించడానికి తెలివైన మార్గాలను కోరుకునే డిజిటల్ టెక్నాలజీ అవగాహన కలిగిన యూజర్ల కోసం మేము కార్డ్ ఆకర్షణీయతను శక్తివంతం చేస్తున్నాం.“ అని అన్నారు.
ప్రయాణాల్లో మరింత విలువ
- తగ్గించబడిన ఫోరెక్స్ మార్క్అప్:ఇప్పుడు అంతర్జాతీయ లావాదేవీలపై కేవలం 1.99%(ఇంతకు ముందు 3.5%)
- ప్రైమ్ సభ్యుల కోసం అమేజాన్ పే ద్వారా ప్రయాణ బుక్కింగ్స్ పై(విమానాలు,హోటళ్లు) 5% అపరిమితమైన క్యాష్ బ్యాక్
- నాన్-ప్రైమ్ సభ్యుల కోసం అమేజాన్ పే ద్వారా ప్రయాణ బుక్కింగ్స్ పై (విమానాలు, హోటళ్లు) 3% అపరిమితమైన క్యాష్ బ్యాక్
కొనసాగించబడే ప్రయోజనాలు
- వార్షిక లేదా జాయినింగ్ ఫీజు లేదు
- అమేజాన్ ప్రైమ్ సభ్యుల కోసం అమేజాన్ షాపింగ్ లో (గోల్డ్ కాయిన్స్ మినహాయించి)అన్ లిమిటెడ్ గా 5% క్యాష్ బాక్
- నాన్-ప్రైమ్ సభ్యుల కోసం అమేజాన్ షాపింగ్ లో (గోల్డ్ కాయిన్స్ మినహాయించి) అన్ లిమిటెడ్ గా 3% క్యాష్ బాక్
- అర్హత కలిగిన Amazon.in కొనుగోళ్లపై ఎల్లప్పుడూ 3 నెలల నో-కాస్ట్ EMI
- అద్దె, పన్ను, విద్య మినహాయించి అమేజాన్ పే శ్రేణుల్లో (లాగిన్ చేయండి, అమేజాన్ తో చెల్లించండి, డిజిటల్ గా ఫుల్ ఫిల్ అయిన శ్రేణులు, Amazon.inపై భౌతిక గిఫ్ట కార్డ్స్ ) లావాదేవీలు చేయడానికి 2% అపరిమితమైన క్యాష్ బాక్
- అమేజాన్ కు బయట (ఇంధనం, కిరాయి, పన్ను, చదువు, యుటిలిటీస్, అంతర్జాతీయ ఖర్చులు మినహాయించి) అన్ని ఇతర ఖర్చులపై 1% అపరిమితంగా క్యాష్ బాక్
- 1% ఫ్యూయల్ సర్ ఛార్జీ మాఫీ
అమేజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పూర్తి డిజిటల్ ఆన్ బోర్డింగ్ అనుభవం ఇవ్వడం కొనసాగిస్తుంది. కార్డ్ అవధిపై నిరంతరంగా సౌకర్యాన్ని నిర్థారిస్తుంది. అనగా అప్లికేషన్ నుండి వాడకం, పునరుద్ధరణ వరకు, ఇది వేగం, సౌకర్యం, కస్టమర్ –కేంద్రీయమైన డిజైన్ కు కార్డ్ యొక్క నిబద్ధతను సూచిస్తోంది.