నవతెలంగాణ-హైదరాబాద్ : 55 కోట్ల కంటే ఎక్కువ ఉత్పత్తులు అదే రోజు లేదా మరుసటి రోజు డెలివరీ చేయబడి 2025 ప్రైమ్ సభ్యుల కోసం తమ అత్యంత వేగవంతమైన డెలివరీ స్పీడ్స్ ను నమోదు చేసిందని అమేజాన్ I ఇండియా ఈరోజు ప్రకటించింది- ఇది సంవత్సరానికి 40% పెరుగుదల. భారతదేశంలో ప్రైమ్ సభ్యులు 2025లో వార్షిక ప్రైమ్ సభ్యత్వం ఖరీదులో రెండు రెట్లు కంటే ఎక్కువగా సగటున ఆదా చేసారు, ఇది దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు ప్రైమ్ అందచేసే విలువను సూచిస్తోంది. తమ ప్రైమ్ సభ్యత్వం ఖరీదులో ఎనిమిది రెట్లు కంటే ఎక్కువగా అగ్ర 10% ప్రైమ్ సభ్యులు ఆదా చేయడంతో, వారు Amazon.inలో కొనుగోళ్లు చేసినప్పుడు భారతదేశంలో ప్రైమ్ బహుళ రివార్డ్స్, ప్రత్యేకమైన డీల్స్, ఆఫర్లు మరియు క్యాష్ బాక్స్ తో పాటు ఉచిత మరియు వేగవంతమైన డెలివరీలు ద్వారా మరింత ఎక్కువగా ఆదా చేయడంలో కస్టమర్లకు సహాయపడింది. వేగవంతమైన డెలివరీలు మరియు గొప్ప డీల్స్ మాత్రమే కాకుండా, ప్రైమ్ సభ్యత్వం ప్రయోజనాల ప్రపంచాన్ని కూడా అందచేసింది- ఇది కొత్త ఉత్పత్తి ప్రారంభాలకు, ప్రైమ్ వీడియోలో అవార్డ్ గెలిచిన షోలు మరియు మూవీలు, అన్ లిమిటెడ్ మ్యూజిక్ స్ట్రీమింగ్, ఉత్తేజభరితమైన గేమింగ్ ప్రయోజనాలు మరియు ఎంపిక చేసిన రీడింగ్ కంటెంట్ కు ముందస్తుగా పొందే అవకాశం కల్పించింది.
భారతదేశంలో నాన్-మెట్రో నగరాల నుండి 70% కంటే ఎక్కువ కొత్త ప్రైమ్ సభ్యులు సైన్ అప్స్ ను అమేజాన్ కొనసాగించింది. నాన్-ప్రైమ్ సభ్యుల కంటే ఎక్కువగా సభ్యులు అయిదు రెట్లు ఎక్కువ తరచుగా కొనుగోళ్లు చేసారు. అమేజాన్ తమ అత్యంత-వేగవంతమైన డెలివరీ సర్వీస్ అమేజాన్ నౌను బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్ మరియు ముంబయిలలోని కొన్ని ప్రాంతాల్లో నిముషాల్లో డెలివరీలను అందచేస్తోంది. ప్రైమ్ సభ్యులు ఈ సేవలు ఉపయోగించడం ప్రారంభించిన తరువాత తమ కొనుగోళ్ల ఫ్రీక్వెన్సీని మూడు రెట్లు పెంచుతున్నారు.
“ మేము చేసే ప్రతి పనిలో మా కస్టమర్లే కీలకంగా ఉంటారు, మరియు వారి రోజూవారీ జీవితాల్లో ప్రైమ్ ఒక అర్థవంతమైన భాగంగా మార డం మేము ఎంతో వినమ్రంగా గమనిస్తున్నాము ” అని అభినవ్ అగర్వాల్-డైరెక్టర్ మరియు ప్రైమ్ హెడ్, అమేజాన్ ఇండియా అన్నారు. “ చివరి నిముషంలో అవసరం కావచ్చు, ప్రణాళికాబద్ధమైన కొనుగోలు కావచ్చు లేదా పూర్తి కుటుంబం ఆనందించే వినోదం కావచ్చు, ప్రైమ్ వేగం, సాటిలేని విలువ మరియు సౌకర్యాలను అందచేయడానికి రూపొందించబడింది. మా కస్టమర్ల తరపున ఆవిష్కరణను కొనసాగించడానికి మరియు దేశవ్యాప్తంగా వేగవంతమైన డెలివరీలు ద్వారా మా సభ్యులకు ఎన్నో ప్రయోజనాలు అందచేయడానికి, ఉత్తమమైన డీల్స్ మరియు విస్తృతమైన ఎంపికను అందచేయడానికి మరియు మరింత కంటెంట్ మరియు వినోదం, మరియు ప్రైమ్ సభ్యుల కోసం ప్రతి రోజును మరింత సౌకర్యవంతంగా మరియు బహుమానపూర్వకంగా చేసే ప్రత్యేకమైన ప్రయోజనాలు అందచేయడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము .”
భారతదేశంవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల కోసం స్పీడ్ మరియు ఎంపికను శక్తివంతం చేసే లక్ష్యంతో లాజిస్టిక్స్, డెలివరీ నెట్ వర్క్ లో అమేజాన్ చేసిన సుస్థిరమైన పెట్టుబడులే ప్రైమ్ ని అనుసరించే వారి సంఖ్య పెరగడానికి కారణంగా నిలిచాయి. భారతదేశంలో సురక్షితమైన, వేగవంతమైన మరియు అత్యంత నమ్మకమైన ఆపరేషన్స్ నెట్ వర్క్ ను రూపొందించి మరియు ఆపరేట్ చేయడానికి తమ నిబద్ధతలో భాగంగా అమేజాన్ ఇండియా 2025లో 2000 కోట్లకి పైగా పెట్టుబడి పెట్టింది. ఆపరేషన్స్ మౌళికసదుపాయాలు విస్తరించి, అప్ గ్రేడ్ చేయడానికి, అసోసియేట్ భద్రత, సంక్షేమాన్ని మెరుగుపరచడానికి మరియు తమ ఆపరేషన్స్ నెట్ వర్క్ కోసం కొత్త సాధనాలు మరియు సాంకేతికను అభివృద్ధి చేయడానికి పెట్టుబడి ఉపయోగించబడింది.
ప్రతి ఒక్క రోజు మీ జీవితాన్ని మెరుగ్గా చేయడానికి అమేజాన్ ప్రైమ్ రూపొందించబడింది. ఎందుకంటే ఇది ఉత్తమమైన షాపింగ్, ఆదాలు మరియు వినోదాన్ని కేవలం ఒక సభ్యత్వంతో అందిస్తోంది. భారతదేశంలో, సభ్యులు ఎంపిక చేయబడిన నగరాల్లో అమేజాన్ నౌలో కేవలం నిముషాల్లోనే డెలివరీ పొందుతున్నారు, ఉచితంగా అన్ లిమిటెడ్ అదే రోజు డెలివరీని 10 లక్షల ఉత్పత్తులపై, 40 లక్షల ఉత్పత్తులపై మరుసటి రోజు డెలివరీని మరియు 20,000కి పైగా అగ్ర-విక్రయాల ఉత్పత్తులను 4 గంటల డెలివరీలో పొందుతున్నారు. రూ. 99 విలువ గల కొనుగోళ్లను అమేజాన్ నౌలో చేసినప్పుడు ప్రైమ్ సభ్యులు ఉచిత డెలివరీతో పాటు వారు రూ. 1,399 విలువ గల షాపింగ్ చేసినప్పుడు అదనంగా రూ. 200 క్యాష్ బాక్ పొందుతున్నారు. వారు ప్రత్యేకమైన డీల్స్, షాపింగ్ ఈవెంట్స్ ను ముందస్తుగా పొందడం, ప్రైమ్ డేకి ప్రత్యేకంగా యాక్సెస్ పొందడం మరియు ప్రైమ్ వీడియోకి అన్ లిమిటెడ్ యాక్సెస్ పొందడం, అమేజాన్ మ్యూజిక్ కు అన్ లిమిటెడ్ గా ప్రకటనలరహితంగా యాక్సెస్ పొందడం , ప్రైమ్ రీడింగ్ తో 3,000 కంటే ఎక్కువ పుస్తకాలు, మేగజైన్స్, కామిక్స్ కు ఉచితంగా భ్రమణ ఎంపికను, ప్రైమ్ గేమింగ్ తో నెలకు ఉచితంగా ఇన్-గేమ్ యాక్సెస్ పొందుతున్నారు. అమేజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ను ఉపయోగిస్తూ Amazon.inపై అన్ని కొనుగోళ్లపై అన్ లిమిటెడ్ గా 5% క్యాష్ బాక్ ను కూడా ప్రైమ్ సభ్యులు సంపాదిస్తున్నారు .
ఎవరైనా భారతదేశంలో ప్రైమ్ లో చేరవచ్చు. సంవత్సరానికి ప్రైమ్ సభ్యత్వం కోసం రూ. 1,499 చెల్లించి పూర్తి షాపింగ్ &ఎంటర్టైన్మెంట్ ప్రయోజనాలు; రూ. 799 చెల్లించి – పూర్తి షాపింగ్ ప్రయోజనాలు & పరిమితమైన ప్రైమ్ వీడియో ప్రయోజనాలు, లేదా రూ. 399 చెల్లించి ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ – కేవలం షిప్పింగ్ మరియు షాపింగ్ ప్రయోజనాలు మాత్రమే కోరుకునే కస్టమర్ల కోసం రూపొందించబడింది- పొందవచ్చు. ప్రైమ్ లో ఇప్పుడు చేరడానికి amazon.in/prime ని సందర్శించండి.



