నవతెలంగాణ హైదరాబాద్: ఆడియో టెక్నాలజీలో ప్రపంచ అగ్రగామి అయిన సెన్ హైజర్, రిపబ్లిక్ డే సేల్ 2026 సందర్భంగా తమ ప్రీమియం ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 16 నుండి ప్రైమ్, నాన్ ప్రైమ్ వినియోగదారులందరికీ ప్రారంభమవుతుంది. ప్రైమ్ మెంబర్లకు జనవరి 15 అర్ధరాత్రి నుండే ముందస్తు యాక్సెస్ లభిస్తుంది. సెన్ హైజర్ అగ్రశ్రేణి ఉత్పత్తులపై వినియోగదారులు 24నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ, ఎంపిక చేసిన బ్యాంక్కార్డులపై అదనపు డిస్కౌంట్లను పొందవచ్చు. ప్రొఫైల్ వైర్ లెస్ మైక్రోఫోన్, ఎమ్డి 421 కాంపాక్ట్, న్యూమాన్ టీఎల్ఎం 102, హెచ్ఎ 630వీబీ, మొమెంటమ్ 4 వైర్స్ హెడ్ఫోన్స్, మొమెంటమ్ ట్రూవైర్ లెస్ 4 ఇయర్ బడ్స్ వంటి విస్తృతశ్రేణి ఉత్పత్తులపై 50శాతం వరకు తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. సెనైజర్ ప్రొఫైల్ వైర్ లెస్ 2– ఛానల్ సెట్, హెచ్ 630 వైర్ లెస్ హెడ్ఫోన్స్, సెనైజర్ ఎమ్డి 421 కాంపాక్ట్, మొమెంటమ్ 4 వైర్లెస్ న్యూమాన్ టీఎల్ఎం 102, మొమెంటమ్ ట్రూ వైర్ లెస్ 4 వంటి మోడల్స్ పై ఆఫర్లను ప్రకటించింది.



