– ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకయ్య, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మెన్ వెన్నెల
– మామిడ్యాల గ్రామంలో అంబేద్కర్, గద్దర్ విగ్రహాల ఏర్పాటుకు భూమిపూజ
నవతెలంగాణ-ములుగు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే.. ఆ రాజ్యాంగంలో ఉన్న విధివిధానాలు అమలుపరిచే విధంగా పోరాటం చేసిన వ్యక్తి ప్రజా గాయకుడు గద్దర్ అని.. వారిద్దరిదీ ఒకే సిద్ధాంతమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకయ్య, తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మెన్ వెన్నెల అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీ మామిడ్యాల గ్రామంలో అంబేద్కర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎడ్ల సత్తయ్య, సభ్యుల ఆధ్వర్యంలో అంబేద్కర్, గద్దర్ విగ్రహాల ఏర్పాటు కోసం శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇద్దరు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన అంబేద్కర్ గ్రామ కమిటీ సభ్యులను అభినందించారు. విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాదు వారి ఆశయాలను కూడా కొనసాగించే విధంగా యువత ముందుండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల వారు ఉన్నత చదువులు చదివి రాజ్యాంగ నిర్మాత కోరుకున్న విధంగా ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. త్వరితగతిన విగ్రహాల నిర్మాణం పూర్తి చేసి ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, ఎస్‌డీఎఫ్ శ్రీహరి యాదవ్, మాలమహానాడు నాయకులు తుమ్మ శ్రీనివాస్, నిరుడు స్వామి, హంస, జిల్లా కన్వీనర్ బండారు దేవేందర్, దళిత సంఘ నాయకులు కొడుకండ్ల నర్సింలు, నాయకులు సత్తయ్య చారి, తమ్మలి శ్రీనివాస్, మోహన్, ఎడ్ల పోచయ్య, అనిల్ కుమార్, రాచకొండ శ్రీకాంత్, ఆరె సత్తయ్య, బబ్బురు వీరేశం గౌడ్ పాల్గొన్నారు.
అంబేద్కర్, గద్దర్.. ఇద్దరిదీ ఒకే సిద్ధాంతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES