Wednesday, March 18, 2026
E-PAPER
Homeవరంగల్వీరాపూర్‌లో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ ఎన్నిక

వీరాపూర్‌లో అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ-కాటారం: వీరాపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నికలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ యువత సానుకూల సహకారంతో జరిగిన ఈ ఎన్నికల్లో సంఘం అభివృద్ధి, సామాజిక సేవలను ముందుకు తీసుకెళ్లే దిశగా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడిగా గద్దల శ్రీనివాస్‌ను ఎన్నుకోగా, గౌరవ అధ్యక్షులుగా గద్దల సమ్మయ్యను నియమించారు. ఉపాధ్యక్షులుగా గద్దల సారయ్య, గద్దల మల్లేష్‌లు బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన కార్యదర్శిగా మంథన రాజశేఖర్, కోశాధికారులుగా గద్దల చందు, గద్దల మూర్తి ఎన్నికయ్యారు.

సభ్యులుగా లింగయ్య, సతీష్, రాజు, నరేష్, ప్రశాంత్, రాజబాబు, అంకయ్య, చిన్న రాజు, సంజీవ్, రాజయ్య, రవీందర్, రమేష్, శ్రీకాంత్, శ్రీధర్, నాగరాజు, హరీష్, శ్రావణ్ శంకర్ తదితరులు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి, యువత సంక్షేమం, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో విద్య, ఉపాధి, సామాజిక చైతన్యం పెంపొందించడమే తమ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -