నవతెలంగాణ-హైదరాబాద్: కులరహిత సమాజ నిర్మాణమే అంబేద్కర్ ప్రధాన లక్ష్యమని ప్రొఫెసర్ బంగ్లా భారతి అన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి విద్యే ప్రధాన సాధనమని ఆమె స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. సోమవారం సీతాఫలమండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత రాజ్యాంగ శిల్పి డా. బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రామనికి ప్రొఫెసర్ బంగ్లా భారతి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు ప్రసంగాలు, నినాదాల ద్వారా అంబేద్కర్ గారి సేవలను స్మరించారు.
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన చర్చలు విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందించాయి. ఈ కార్యక్రమానికి కళాశాల అధ్యాపకులు డా. జైపాల్, డా.కె సైదులు, బి.వెంకటేశం, డా. రాజు, రాఘవేంద్ర, రజిని , సమతావని, డా.యస్ కిషోర్, డా.వై సైదులు, ఐమాన్, రామకృష్ణ, ఈశ్వరి, శిల్ప, శ్రీనివాస్, ఇన్నారెడ్డి,విద్యార్థులు పూజ, ఆశ, సౌజన్య, సందీప్, ప్రదీప్ తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కళాశాల సిబ్బంది, నిర్వాహకులను ప్రిన్సిపాల్ అభినందించారు.




