Sunday, January 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅంబర్‌పేట్ ఎస్సై భాను ప్రకాష్ రెడ్డి అరెస్ట్

అంబర్‌పేట్ ఎస్సై భాను ప్రకాష్ రెడ్డి అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ లోని అంబర్‌పేట్ ఎస్సై భాను ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు రికవరీ సొత్తును కాజేసి తాకట్టు పెట్టిన వ్యవహారంలో ఆయన పాత్ర వెలుగులోకి రావడంతో ఈ అరెస్ట్ జరిగింది. అంతేకాకుండా తన సర్వీస్ రివాల్వర్‌ను ట్రైన్‌లో పోగొట్టుకున్నట్లు భాను ప్రకాష్ వెల్లడించారు. ఈ ఆయుధం గల్లంతు భద్రతాపరంగా తీవ్ర అంశంగా మారడంతో విచారణ కొనసాగుతోంది. కాగా పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుందని, అవసరమైతే మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -