- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని వనస్థలిపురం ఆటోనగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఓ అంబులెన్స్ ఢీకొనడంతో డ్రైవర్‌తోపాటు ఇద్దరు రోగులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను స్థానికులు అతికష్టం మీద బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
- Advertisement -



