వాణిజ్య ఒప్పందం
వాహనాలపై టారిఫ్‌లు 15 శాతం తగ్గింపు
వాషింగ్టన్/టోక్యో : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జపాన్‌తో కీలక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నారు, దీనిలో ఆటో దిగుమతులపై టారిఫ్‌లు తగ్గించారు. టోక్యోకు ఇతర వస్తువులపై కొత్త భారీ లెవీల నుండి మినహాయింపు లభించినట్లయ్యిందని ఆ దేశ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందంలో భాగంగా జపాన్ 100 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయనుంది. అమెరికా సంస్థలతో రక్షణ ఖర్చులను సంవత్సరానికి 14 బిలియన్ డాలర్ల నుండి 17 బిలియన్లకు పెంచనుందని వైట్‌హౌజ్ వర్గాలు తెలిపాయి. తాజా ఒప్పందంలో ఇప్పటివరకు జపాన్ వాహనాలపై 27.5 శాతం ఉన్న టారిఫ్‌లు 15 శాతానికి తగ్గించబడ్డాయి. ఆగస్టు 1 నుండి ఇతర జపాన్ వస్తువులపై విధించబడే డ్యూటీలు కూడా 25 శాతం నుండి 15 శాతానికి పరిమితం కానున్నాయి. ”నేను జపాన్‌తో చరిత్రలో అతిపెద్ద వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాను,” అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ప్రకటనతో మంగళవారం సాయంత్రం జపాన్ బెంచ్‌మార్క్ నిక్కీ స్టాక్ ఇండెక్స్‌ను దాదాపు 4 శాతం పెరిగింది.
జపాన్‌తో అమెరికా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES