Sunday, May 4, 2025
Homeజాతీయంభారత నావీ నిఘాకు అమెరికా సాఫ్ట్‌వేర్‌

భారత నావీ నిఘాకు అమెరికా సాఫ్ట్‌వేర్‌

- Advertisement -

– రూ.1107 కోట్ల డీల్‌కు ట్రంప్‌ ఆమోదం
న్యూఢిల్లీ:
అమెరికాలోని డోనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం భారత్‌కు రూ.1107 కోట్లకు పైగా(131 మిలియన్‌ డాలర్లు) విలువైన ప్రతిపాదిత ఇండో-పసిఫిక్‌ సముద్ర డొమైన్‌ అవగాహన సంబంధిత సాఫ్ట్‌వేర్‌, పరికరాల అమ్మకానికి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా నోటిఫై చేసింది. కీలకమైన ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో తన పాత్ర పెరుగుతున్నందున భారత్‌ ఇటీవల సీవిజన్‌ సాఫ్ట్‌వేర్‌, విశ్లేషణాత్మక మద్దతు, లాజిస్టిక్స్‌, ప్రోగ్రామ్‌ సపోర్ట్‌, ఇతర సంబంధిత అంశాల ను కొనుగోలు చేయాలని అమెరికాను అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ”ఈ ప్రతిపాదిత అమ్మకం అమెరికా-భారత వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేయటానికి, ఇండో-పసిఫిక్‌, దక్షిణాసియా ప్రాంతాలలో రాజకీయ స్థిరత్వం, శాంతి, ఆర్థిక పురోగతికి ముఖ్యమైన శక్తిగా కొనసాగుతున్న ప్రధాన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగు పర్చటానికి సహాయపడటం ద్వారా అమెరికా విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది” అని అమెరికా రక్షణ భద్రతా సహకార ఏజెన్సీ.. అమెరికా కాంగ్రెస్‌కు పంపిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నది. ప్రతిపాదిత అమ్మకం భారత్‌ తన సముద్ర డొమైన్‌ అవగాహన, విశ్లేషణాత్మక సామర్థ్యాలు, వ్యూహాత్మక వైఖరిని బలోపేతం చేయటం ద్వారా ప్రస్తుత, భవిష్యత్తు ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -