నెల్లూరు నరసింహారావు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో అమెరికా సంబంధాలను ఊహించని స్థాయిలో ఇప్పటికే దెబ్బతీశాడు. ట్రంప్ రెండవసారి గెలిచిన తర్వాత భారతదేశంతో సహా అనేక దేశాలు కఠినమైన అమెరికన్ దౌత్య దాడిని ఊహించలేదు. తాజాగా ట్రంప్ భారతదేశంతో వాణిజ్య వైరుధ్యాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని సూచనప్రాయంగా చెప్పాడు. రాబోయే 24 గంటల్లో సుంకాలను ”గణనీయంగా” పెంచాలని అమెరికా యోచిస్తోందని ఆయన ప్రకటించాడు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును కొనసాగించడం ద్వారా న్యూఢిల్లీ, మాస్కోతో నిరంతర సంబంధం కలిగి వుండటం రూపంలో ఈ రెచ్చగొట్టే చర్య తలెత్తిందని ఆయన నొక్కి చెప్పాడు. ఈ విషయాన్ని ట్రంప్ గతంలో కూడా వ్యక్తం చేశాడు. ”భారతదేశం మాపై అందరికన్నా అత్యధిక సుంకాన్ని విధిస్తోంది. మేము 25 శాతం సుంకాన్ని మాత్రమే విధించటానికి సిద్దపడ్డాము. కానీ వారు రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్నందున రాబోయే 24 గంటల్లో నేను దానిని గణనీయంగా పెంచబోతున్నాను. వారు రష్యన్ యుద్ధ సామర్థ్యాన్ని పెంచి పోషిస్తున్నారు. భారతదేశంతో మా వ్యాపారం తక్కువ స్థాయిలో ఉంటుంది. మాతో వారు చాలా వ్యాపారం చేస్తారు” అని సీఎన్ బిసితో మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు.
భారత్-రష్యా సంబంధాలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ తన భారత విదేశాంగ విధానాన్ని రూపొందిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇదే కారణంగా భారతదేశంపై 25 శాతం సుంకాలను డోనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశాడు. భారతదేశం రష్యన్ ముడి చమురును పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవడమే కాకుండా ప్రపంచ మార్కెట్లలో లాభం కోసం దానిని తిరిగి విక్రయిస్తోందని తాజాగా ఆయన ఆరోపించాడు. అంతకు ముందు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో కఠిన పదజాలంతో కూడిన సందేశాన్ని పోస్ట్ చేశాడు. భారతదేశం ”భారీ మొత్తంలో రష్యన్ చమురును” కొనుగోలు చేసి ”ఓపెన్ మార్కెట్‌లో పెద్ద లాభాల కోసం” తిరిగి విక్రయిస్తోందని ఆయన ఆరోపించాడు. ”ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో ఎంత మంది చనిపోతున్నారో వారు పట్టించుకోరు. దీని కారణంగానే భారతదేశం అమెరికాకి చెల్లించే సుంకాన్ని గణనీయంగా పెంచుతాను” అని ట్రంప్ రాశాడు.
భారతదేశంపై ట్రంప్ చేస్తున్న ఆరోపణలు ఆధారం లేనివని, రాజకీయ ప్రయోజనాలకోసం ఉద్దేశింపబడినవని విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో పశ్చిమ దేశాలు తన సొంత దేశీయ ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి సాంప్రదాయ సరఫరా మార్గాలను మళ్లించిన తర్వాతే భారతదేశం రష్యన్ ముడి చమురు కొనుగోలు వైపు మొగ్గు చూపిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ”ఆ సమయంలో అమెరికా ప్రపంచ ఇంధన మార్కెట్ల స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం చేసే దిగుమతులను చురుకుగా ప్రోత్సహించింది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
రష్యాతో పశ్చిమ దేశాలకున్న లోతైన ఆర్థిక సంబంధాలను, పర్యవసానం గా తలెత్తిన సంక్లిష్టతలను భారత విదేశాంగ శాఖ ఎత్తిచూపింది. 2024లో యూరోపియన్ యూనియన్ రష్యాతో 67.5 బిలియన్ యూరోల వాణిజ్యాన్ని, సేవలలో 17.2 బిలియన్ల యూరోల వ్యాపారాన్ని నమోదు చేసింది. ఆ సంవత్సరం యూరోపియన్ యూనియన్ రష్యన్ ధ్రువీకత సహజ వాయువు దిగుమతులు రికార్డు స్థాయిలో 16.5 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ఈ పరిమాణాలతో పోల్చినప్పుడు భారతదేశ వాణిజ్యం స్థాయి నామమాత్రంగానే ఉన్నదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ విషయంలో అమెరికా తక్కువేం తినలేదు. ఇదే కాలంలో రష్యాతో తన ఆర్థిక సంబంధాలను కొనసాగించింది. అమెరికా అణు రంగానికి కావలసిన యురేనియం హెక్సాఫ్లోరైడ్, దాని ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు కావలసిన పల్లాడియం, వివిధ రకాల ఎరువులను, పారిశ్రామిక రసాయనాలను దిగుమతి చేసుకుంటూనే ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ నేపథ్యంలో భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవడం అన్యాయం, అసమంజసమే కాకుండా అది సామ్రాజ్యవాద దురహంకారంతో చేస్తున్న పనిగా భావించాలి. ఇతర దేశాల మాదిరిగానే భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవటంలో నేరం ఒక్క అమెరికాకు మాత్రమే కనపడటం హాస్యాస్పదం. నిజం చెప్పాలంటే అమెరికా వస్తువులు, సేవలలో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాబట్టి భారతదేశం అధికారికంగా డీ-డాలరైజేషన్ ఎజెండాను తిరస్కరించింది. భారతదేశం అమెరికా నుంచి మరిన్ని పెట్టుబడులు, సాంకేతిక బదిలీలను కోరుకుంటుంది. అనేక విధాలుగా ఇవి వాషింగ్టన్‌తో న్యూఢిల్లీ సంబంధాలు బలోపేతం కావటానికి, అభివద్ధి లక్ష్యాలను సాధించడానికి అత్యంత ముఖ్యమైనవి. కానీ అది ఒక దేశంపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించడానికి, దాని బాహ్య సంబంధాలను సమతుల్యం చేయడానికి, అమెరికా విదేశాంగ విధాన అతిక్రమణలను తట్టుకోవటానికి భారతదేశం ఇతర దేశాలతో భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవటాన్ని నిరోధించజాలదు.
ఇక అమెరికా సుంకాలు గణనీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES